ఈ పోస్ట్ వ్రాసింది మీరే…


ప్రస్తుతం ఆసుపత్రులు. డాక్టర్ ల గురించి వ్రాయమంటే..
ఈ క్రింది పోస్ట్ ను ఏ మాత్రం తేడా లేకుండా ఇలానే వ్రాస్తారు
ఎవ్వరైనా సరే ..[కారణాలు తరువాత మరో సారి వెతుకుదామ్]
చదవండి…
దోచుకుంటున్న ఆసుపత్రులు…!

ఒంగోలు సిటి, మేజర్‌న్యూస్‌: ఆకలిపోరాటం, తీరని అప్పులు, నకిలీ ఆహారం, పర్యావరణ కాలుష్యం, అన్నీ కలిసి ప్రజల్ని రోగాల బారిన పడేస్తుంటే ఆరోగాన్ని త గ్గించుకోవడానికి అసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. మనిషికి నిరంతరం తన జీవన పోరాటంలో ఎదుర్నొన్న సమస్యలతో సతమతమవుతూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా పూర్తి స్థాయి వైద్య, ఆరోగ్య సేవలను అందించల్సి ఉండగా అది అవినీతి మయమై అధర్మాసుపత్రులై పోయాయి. ఏదో విధంగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యవసరంగా నైనా ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళక తప్పడం లేదు. ఈనాడు ప్రధానంగా సమాజంలో ఉన్న సేవారంగాలు, విద్యతో పాటు వైద్య రంగాలు పూర్తి వ్యాపార రంగంగా మారిపోయాయి.

ఈనేపధ్యంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాల్లో సూపర్‌స్పెషాల్టీ వైద్యాన్ని అందిస్తామని బహుళజాతి కంపెనీల పద్దతిలో అనైతిక ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. మరి పేద మధ్య తరగతి వర్గాల వారికి ఈసౌకర్యం పొందాలంటే కొత్త ఆందోళన కలిగే భయరోగం దాపురిస్తుంది.పట్టణంలో ప్రత్యేకంగా నెలకొన్న స్పెషాలిటీ పేరుతో కొనసాగుతున ప్రైవేటు వైద్యశాలలు గుండె, ఊపిరితిత్తుల జబ్బులకు వైద్యంచేసే ఆసుపత్రుల్లో ఓపి 100 రూపాయలుంటుంది. అదే అత్యవసరమైతే 150 రూపాయలు అవుతుంది. కానీ ఎంత అత్యవసరమైనా డాక్టర్‌ వెంటనే రారు. ముందుగా అవసరం ఉన్నా లేకున్నా అక్కడి సిబ్బంది రోగికి ఇసిజి పరీక్ష చేస్తారు.

దీనికి 350 రూపాయల వసూలు చేస్తారు. తరువాత ఎక్స్‌రే అంటారు. దీన్ని డాక్టర్‌ చూసే సమయానికి కనీసం రెండు గంటలు పడుతుంది. రోగిని పరిశీలించి వారి బంధువుల ఆందోళన గుర్తించిన డాక్టర్‌ వెంటనే రక్తపరీక్షలు, స్కానింగ్‌ అంటూ రాస్తారు. ఇవిరెండూ 3నుండి 4వేల రూపాయల వరకు అవుతాయి. ఆ రిపోర్టులు వచ్చి వాటిని పరిశీలించిన తరువాత హాస్పటల్‌లో ఉండాలంటూ అత్యవసర విభాగంలో ఉంచుతారు. అప్పటికీ రోగమేంటో చెప్పరు. అలా మూడు రోజులు గడిచిన తరువాత ఇప్పుడు ఫరవాలేదా అని అడుగుతారు. తరువాత మరో మూడు నాలుగు రోజులుంచి డిశ్చార్చి చేస్తారు. చేసే టప్పుడు కనీసం ఒక కిలో మందులు రాస్తారు.జేబు ఖాళీ చేస్తారు.

అప్పుడు ఏమీ లేదు కొంచెం గ్యాస్‌ ఉంది. మసాలా లాంటి పదార్ధాలు తినకుండా జాగ్రత్త వహించండి అని చెబుతారు. ఇది ఇలా ఉంటే మరికొన్ని వైద్యశాలలు ఆరోగ్యశ్రీ పధకం ద్వారా వచ్చిన రోగుల్ని ఆదాయ మార్గాలుగా వాడుకుంటున్నాయి. వేలకు వేలు అదనంగా పద్దులు వేసి ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నాయి. మరికొంత మంది వైద్యులు వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఇతర వైద్యశాలలకు పంపించి రోగుల్ని తిప్పుతున్నారు. యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తే గానీ రోగం తెలుసుకోలేని వ్యాపార వైద్యులు వారి ఆదాయం పెంచుకోవడానికి విదే శాల పర్యటనలు, యంత్రాల పేరుతో అమాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

పేదవారికి ఆర్ధిక సహాయం చేసేందుకు సిధ్దపడని బ్యాంకులు వీరికి కోట్ల రూపాయల రుణ సహాయం చేస్తాయి. ఈదోపిడీ కేవలం ఒక్క ఆసుపత్రిలోనే కాదు.ఈ సంస్కృతి ఒక జాడ్యంలాగా మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల డబ్బును దోచుకుంటున్న వైద్యశాలలపై పర్యవే ణ చేయాల్సిన అధికారులు లంచాలు మామూళ్ళతో మిన్నకుండిపోతున్నారు. ఏ విధమైన చట్టబద్దమైన నిబంధనలు ఆచరించరు. రోగుల నుండి వసూళ్ళు చేసే ఏ ఒక్క రూపాయికి అధికారికంగా లిఖిత పూరితమైన బిల్లులుండవు. రోగుల జాబితాను, రూమ్‌ రెంట్‌లు, పరీక్షలు బిల్లులు అన్నీ అనధికారమైన రికార్డులుగా నమోదుచేస్తారు. చిత్తుకాగితాల్లో బిల్లులు రాసిస్తారు. డాక్టర్‌ను సంప్రదించే అవకాశం కల్పించరు. వీటన్నింటిని ముందుగానే అడ్వాన్సులు చెల్లించుకోవడం పెద్ద దుర్మార్గం అయితే ఇక్కడ చేసిన వైద్యం తాలూకు వివరాలు తెలపడానికి వారు అంగీకరించరు. ఎందుకంటే వారు చేసిన వైద్య సేవల్లోని లోపాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఇక్కడ ఈనేపధ్యంలోనే తలెత్తే పెద్ద సందేహం ఏమిటంటే ఈ ఆసుపత్రి మరణాలకు బాధ్యులు ఎవరు?
[సూర్య దిన పత్రిక నుండి…]

3 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s