రూ.3 కో…ట్ల కారు..


ఇలాంటి చిన్నకార్లు కాదు గానీ ఓ మాంచి లగ్జరీ కారు చూపించు
అంటారా..సరే రండి..ఓ మూడు కోట్లు..రూపాయలే నండీ..రెడీ చేస్కొండి..

మార్కెట్లోకి మూడు కోట్ల కారు

కారంటే పదిలక్షలు.. ఇరవై లక్షలు..యాభై లక్షలు ఉంటుందని అనుకుంటాం..కానీ మూడు కోట్ల రూపాయల కారు కూడా ఉంది మరి..లగ్జరీ కార్లు కోరుకునే వాహనదారుల కోసం సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి..ఈ తరుణంలో బెంట్లీ సంస్థ ‘మల్‌సాన్‌’ మూడుకోట్ల కారును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు వివరాలు ఈ వారం ‘న్యూలుక్‌’లో మీకోసం…

బ్రిటిష్‌ సూపర్‌ లగ్జరీ కార్ల దిగ్గజం బెంట్లీ అత్యంత ఖరీదైన మల్‌సాన్‌ కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లగ్జరీకి చిరునామాగా నిలిచే ఈ కారు ఖరీదు మూడు కోట్ల రూపాయలు. ఈ మోడల్‌తోపాటు కన్వర్టబుల్‌ జీటీసీ సూపర్‌ స్పోర్ట్‌ కారును కూడా అక్టోబర్‌నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కారు డిజైనింగ్‌లో మార్పులు చేసే అవకాశం, 6.7 లీటర్ల సామర్ధ్యం కలిగిన వి 8 పెట్రోల్‌ ఇంజిన్‌, స్టీల్‌ బాడీ, అల్యూమినియం హ్యాండిల్‌ ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. రెండు టర్మో ఇంజన్లు కల మల్‌సాన్‌ కారు బిలియన్‌ ట్రిమ్స్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

మామూలు కార్ల తయారీకి ఐదు నుంచి ఆరుగంటల సమయం పడితే మల్‌సాన్‌ కారు తయారీకి 660గంటలకు పడుతుంది. 1980లోనే మల్‌సాన్‌ మార్కెట్‌ ప్రవేశం చేసినప్పటికీ ఆ తరువాత ఈ కారును 1992లో కంపెనీ ఉపసంహరించుకుంది. కొత్త ఫీచర్లతో స్టైలిష్‌గా డిజైన్‌ చేసిన కొత్త మల్‌సాన్‌కు, పాతకారుకు పోలికే లేదని, అక్టోబర్‌లో ఇండియన్‌ డెలివరీలు ప్రారంభిస్తామని బెంట్లీ సంస్థ చెపుతోంది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పది మోడల్స్‌ను విక్రయిస్తున్న బెంట్లీ నుంచి త్వరలో కోటి రూపాయల విలువ చేసే మరో రెండు కార్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ రీజనల్‌ డైరెక్టర్‌ క్రిస్‌ బక్స్‌టన్‌ తెలిపారు. ఈ కారుకు సంబంధించిన ఉత్పత్తి పనులను త్వరలో యూకెలోని క్రూ ఉత్పత్తి కర్మాగారంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. జీటీసీ సూపర్‌స్పోర్ట్స్‌ కారు ఇప్పటికే గతంలో జెనీవా ఆటోఎక్స్‌పోలో విడుదలైందని, కోటి రూపాయాలకు పైగా ఉండే ఈ కారు ధరను ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు.

ఈ ఏడాది లగ్జరీ కార్ల విభాగంలో దేశీయంగా వృద్ధిని ఆశిస్తున్నామన్నారు. అంతర్జాతీయ విక్రయాలలో భారత్‌ వాటా 2 శాతం ఉందని, కొత్తగా విడుదల కానున్నా ఈ రెండు మోడల్‌ కార్లు రోల్స్‌రాయిస్‌, లాంబర్గినీతోపాటు ఇతర లగ్జరీ కార్లతో కూడా పోటీ పడనున్నాయని అన్నారు. దేశీయంగా లగ్జరీ కార్ల మార్కెట్‌ 200 నుంచి 300 యూనిట్లుగా ఉందని, భారత్‌కన్నా చైనా దేశంలో తమ విక్రయాల్లో పదిశాతం అధికంగా నమోదవుతున్నాయన్నారు.

– ఇస్కా రాజేష్‌బాబు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s