కలసి వుంటే కలదు సుఖము..


నేను ఈ క్రి౦ది మాటర్ చదివాక నన్ను బాగా ఆకట్టుకున్న విష్యం
అక్క చదూ కోసం ఉదయమే 4 గంటలకు లేచి పేపర్ కోసం పక్క ఊరు
వెళ్ళి వచ్చే తమ్ముడు..చిన్న ఫ్యామిలీ ల్లో ఇలాంటి ఎంకరేజ్ మెంట్ వుంటే ..
అన్న కి ఎక్కువ పెడుతున్నావని తమ్ముడు..
చెల్లికి దోచిపెట్టేస్తున్నావ్ అనే అక్కలూ ..లేకుంటే ..


ప్యూన్‌ కూతురికి సివిల్స్‌ ర్యాంక్‌
అరకొర వనరులున్నా..లక్ష్య సాధనఓపెన్‌ కేటగిరిలో 138 వ ర్యాంకు రిజర్వ్‌డ్‌ కేటగిరిలో ఇంకా మెరుగుపడే అవకాశాలు
కుటుంబ ప్రోత్సాహమే ప్రధాన కారణం

అతనిది రెవెన్యూ శాఖలో చిరు ఉద్యోగం. నెలకు వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితేనేం తన కూతురుని ఐఏఎస్‌గా చూడాలనుకున్నాడు. ఐఏఎస్‌ అంటే ఆశా మాషీ కాదని, ఎంతో ఖర్చుతో కూడుకున్నదని తెలిసినా వెనక్కుతగ్గలేదు.బ్యాంకురుణం తీసుకుని ఆమెకు ఐఏఎస్‌ శిక్షణ ఇప్పించాడు. తన తండ్రి పడ్డ కష్టాన్ని ఆమె కూడా ఊరికే పోనీయలేదు. కష్టపడేతత్వం, ఓ టీవీ సిరియల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 138 వ ర్యాంకు సాధించి, అందరిచేత శభాష్‌ అనిపించుకుంది.

వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని మొరిండా అనే చిన్న పట్టణంలో రెవెన్యూ శాఖలో ప్యూన్‌గా పనిచేస్తున్న రంజిత్‌ సింగ్‌ కూతురు సందీప్‌ (29) ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ ఓపెన్‌ మెరిట్‌ జాబితాలో 138 వ ర్యాంకు సాధించింది. షెడ్యూల్ట్‌ కులానికి చెందిన సందీప్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరి జాబితాలో తన ర్యాంకు ఇంకా మెరుగుపడుతుందనే ఆశతో ఉంది. అయితే రిజర్వ్‌డ్‌ కేటగిరి జాబితాను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఈ సందర్భంగా సందీప్‌ కౌర్‌ మాట్లాడుతూ ‘‘ నేను గుమాస్తా కూతురునైనందుకు గర్విస్తున్నాను.నా తండ్రి తన ఉద్యోగ సమయాన్ని గౌరవంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అరకొర వనరులున్నప్పటికీ, నా తండ్రి నాకు చాలా మంచి సౌకర్యాలు కల్పించారు.నా విజయాన్ని తల్లితండ్రులకు, దేవుడికి అంకితమిస్తున్నాను.’’ అని అన్నారు. ఒక కింది స్థాయి మధ్య తరగతి బాలిక ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారిగా మారిన ‘ఉడాన్‌’ సీరియల్‌ చూసిన తరువాత తాను చాలా ప్రేరణ పొందినట్టు ఆమె తెలిపారు. గతంలో తనకు ఎదురైన కష్టాల గురించి ఆమె మాట్లాడుతూ‘‘ఇంజనీరింగ్‌ అయిపోయిన తరువాత, ఐఏఎస్‌కు సిద్ధమవడానికి ముందు, అర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉద్యోగం చేయాలనుకున్నాను.

అయితే వరుసగా రెండు సంవత్సరాల పాటు నాకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో బాలికలకు చాలా తక్కువ అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం.’’ అని అన్నారు. తనకు మార్గదర్శకత్వం చేసేందుకు ఎవరూ లేరని, శిక్షణ తీసుకునేందుకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించుకునే పరిస్థితుల్లో తాము లేనందున మొదటి రెండు ప్రయత్నాలను(2005,2006) ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే రాశానని పేర్కొంది. మూడో సారి తన తండ్రి బ్యాంకు రుణం తీసుకున్నాడని, తద్వారా చంఢీగడ్‌, పటియాల, న్యూఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని ఆమె తెలిపింది. ఇంజనీరింగ్‌ చదివినప్పటికీ, సోషియాలజీ, పంజాబ్‌ లిటరేచర్‌ను ఆమె ఎంచుకుంది.

2007లో మెయిన్‌ ఎగ్జామ్‌లో 936 కటాఫ్‌ మార్కులు కాగా, 933 సంపాదించి, మూడు మార్కుల తేడాతో మెయిన్‌ పరీక్షకు అర్హత కోల్పోయింది. తన విజయం వెనుక తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని, హిందూ పత్రిక తమ ప్రాంతంలో దొరకదని, దీంతో ప్రతి రోజు ఉదయం 4 గం.లకు తన సోదరుడు దగ్గలోని ఖరార్‌ పట్టణానికి వెళ్లి ిపత్రికను తెచ్చేవాడని సందీప్‌ పేర్కొంది. సందీప్‌ తల్లి అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ ‘‘ మాది పంజాబ్‌లోని చాలా చిన్న పట్టణం. ఇక్కడ వనరులు చాలా తక్కువ, అయితేనేం మా కూతురు దేశంలోనే అత్యంత కష్టంగా భావించే పరీక్షల్లో ఒకదానిని విజయవంతంగా సాధించింది. మా ఊర్లో అందరికీ గర్వంగా ఉంది. ఇక నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.’’ అని ఆమె పేర్కొంది.

సందీప్‌ ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పటి నుంచే ఆమె ఐఏఎస్‌ కావాలని తాను కోరుకున్నట్టు,తన కలలు ఇప్పటికి సాకారమయ్యాయని అమర్‌జిత్‌ పేర్కొన్నారు. సివిల్స్‌లో ర్యాంకు సాధించడమంటే అంత సులువుకాదని, ఈ ప్రయాణంలో అనేక లెక్కలేనన్ని అవాంతరాలు, నిరాశలు ఎదురయ్యాయని, అయితే అవన్నీ తన కూతురి ధృడ సంకల్పం ముందు తలొగ్గాయని ఆమె అన్నారు. సందీప్‌ సోదరుడు గురుప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రిలిమ్స్‌ సందర్భంగా ఆమె 18 గంటలు చదివేదని, ఇక మెయిన్స్‌ అప్పుడయితే 20 గంటలు చదివేదని తెలిపారు. చాలా ఛానళ్ల విలేకరులు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు తమ ఇంటికి వస్తూన్నారని, అయితే సందీప్‌ చాలా సిగ్గుపుడుతుందని, కెమెరా ముందుకొచ్చేందుకు భయపడుతుందని అన్నారు. తన సోదరి మార్గదర్శకత్వంలో తానూ సివిల్స్‌ పరీక్ష రాసేందుకు సిద్ధపడతానని గురుప్రీత్‌ తెలిపారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s