న్యూ వేగన్-ఆర్


ఆల్టో వేగన్ ఆర్ బాగా క్లిక్ అయ్యాయి…మరింత కొత్త హంగులతో న్యూ వేగన్ ఆర్ గా తీస్కు వచ్చారు
మారుతీ వారు..ఆడవాళ్ళకు చాలా కంఫర్ట్ డ్రైవింగ్ చేయాలనుకుంటే సిటీల్లో.. వేగన్ ఆర్ బావుంటుంది..
పెట్రోల్ వెర్షన్ అని బయ పడక్కర్లా లాంగ్ journey లో కిట్టు బాటు అయిపోతుంది..
చాలా రోజుల క్రితమే రిలీజ్ ఐనా చూశాక రెకమేండ్ చేద్దామని ఆగా..
మీ ఫ్యామిలి వరకూ తిరిగి చూడక్కర లేదు..ఈ సిగ్మెంట్లో ని కార్లకన్నా..
కూర్చున్నపుడు ఎత్తుగా కంఫర్ట్ వుంటుంది..ఓ లుక్ వేయండీ..

మారుతీ పేరు వింటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజల కారుగా చెపుతారు. తొలినుంచి మారుతీ కార్లకు ఎంతో ఆదరణ ఉండేది. రానురానూ పలు కంపెనీలు సరికొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నా పోటీని తట్టుకుని మారుతీ కారు కూడా కొత్తరూపు సంతరించుకుంది. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడల్స్‌ తయారీలోకి అడుగుపెట్టింది. తాజాగా మారుతీ సంస్థ కొత్త వ్యాగర్‌ ఆర్‌ను హైదరాబాద్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ కారు వివరాలు ఈవారం ‘న్యూలుక్‌’లో మీకోసం…

చిన్నకుటుంబం ఎలాంటి చింతలేకుండా ప్రయాణించే సౌకర్యం మారుతీ కారు సొంతం. కానీ ప్రస్తుతం పెద్దకుంటుంబం కూడా ఎంత దూరమైరనా సులభంగా ప్రయాణించేలా మారుతీ వ్యాగన్‌ ఆర్‌ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర మార్కెట్లో మారుతీ కార్ల సంస్థ తన సరికొత్త వ్యాగన్‌ ఆర్‌ను ప్రవేశపెట్టింది. సంస్థ మేనేజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఐ.వి.రావు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో ఈ కోత్త కారును మార్కెట్లోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఉండే కె సిరీస్‌ ఇంజన్‌ను కారుకు అమర్చామని, అదనపు ఇంజన్‌ సామర్ధ్యంతో ఈ కారు పనిచేస్తుందన్నారు. అదనపు సౌకర్యాలు, ఆకర్షణలతో ప్రయాణీకులు ఇష్టపడేలా ఈ కారును డిజైన్‌ చేసినట్లు చెప్పారు. ఏ2 కార్ల విభాగంలో తమ మార్కెట్‌ వాటా పెంచుకోవడానికి ప్రధానంగా ఈ కారును విడుదల చేస్తున్నామని, కంపెనీ చేస్తున్న పరిశోధన, అభివృద్ధికి ఈ కారు ఒక ఆనవాలుగా నిలుస్తుందన్నారు.

భారత్‌ స్టేజ్‌ 4 ప్రమాణాలకు అనుగుణంగా లీటర్‌ పెట్రోల్‌కు 1.89 కిమీ మైలేజ్‌ను ఈ కారు ఇస్తుందని చెప్పారు. అద్భుతమైన సస్పెన్స్‌ టెక్నాలజీ, కేబుల్‌ టైప్‌ గేర్‌ లిఫ్ట్‌ ఈ కారుకు ప్రత్యేక అలంకరణలుగా ఉన్నాయని అన్నారు. కారు పొడవును 75 ఎంఎంకు పెంచి 3595 ఎంఎంకు విస్తరించామని, అలాగే వీల్‌ బేస్‌ పొడవు 2400 ఎంఎంగా ఉందని పేర్కొన్నారు. ఏ2 వాహన విభాగంలో పెద్ద ఎత్తు, వెడల్పు ఉన్న కారు ఇదేనని, ఎల్‌ఎక్స్‌ మోడల్‌ రూ.3.28 లక్షలుగా నిర్ణయించామని, విఎక్స్‌ఐ మోడల్‌ 3.81 లక్షలుగా ఉంటుందని వివరించారు


[సూర్య దిన పత్రిక నుంచి]

ప్రకటనలు

2 Comments

  1. అదే నేనూ చూశా నన్దీ 18.9 కిమీ అయి వుంటుంది..ఎందుకంటే దీని ముందు వర్షన్ మేము వాడుతున్నాం…అది 17కిమీ వరకూ హై వే మీద వస్తూంది..లీటర్ కు..మరింత ఇంప్రూవ్ చేసి వుంటారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s