నేను పెద్ద సంఘసంస్కర్త నయ్యా..


ఉచిత సలహాలు తెగ ఇచ్చేస్తుంటా నేను..అల్లానే మా దగ్గర పని చేసే కాంపౌందెర్ ఒకబ్బాయిని పని అయ్యాక
సినిమాలు అంటూ బలాదూర్ తిరుగుతూటే వాడి బుర్ర తిన్నా.రోజు ఓ 10 గంటల రెగ్యులర్ పని తర్వాత
సినిమాలనంటూ తిరక్కుండా ముందుగానే ఇంటికి పోయి ప్రాక్టీస్ చేసుకోమన్నా…
దానికి మా కుర్రాడు సార్ బస్సులోనో ఆటో లోనో ఇంటికి పోయినప్పటికి టైమ్ మిగల్డు సార్ పేషెంట్లు
వచ్చిన టైమ్ కి మనం రీచ్ అవ్వాలి మా వూరు అన్నాడు.20 km వరకూ వుంటుంది వూరికి దూరం.
వెంటనే లోన్ మీద బండి తీస్కోమన్నా…బండి తీస్కోవడం..ఇక్కడ పని అవ్వంగానే తన వూరుకి వెళ్లిపోవడం
మొదలు పెట్టాడు సినిమాలూ అవ్వీ మానేసి..
ఇది జరిగి 5-6 నెలలు అయింది.మనోడు ప్రస్తుతం 100 నుండి 300 వందల వరకూ సంపాదిచుకుంటున్నాడు.
నెల నెలా లోన్ క్లియర్ చేసుకుంటున్నాడు..ప్రతీ రోజూ..
మరో కుర్రాడు రోజంతా ఎలానో డ్యూటి లోనే ఓ వందో రెండొందలో సంపాదించి సాయంత్రం అయేటప్పటికి
మందు బిగించేసేవాడు..తర్వాత ఓపిక బట్టి రాత్రి పన్నెండు వరకూ మరో రెండో మూడో పెగ్గులు బిగించి
ఓ పెద్ద ఫైటింగ్ సీన్ క్రియేట్ చేసి ఇంట్లో వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు..మూడేళ్ళగా ఇదే వరస..
వాడిని ఓ శనివారం తలకి స్నానం చేయించి వెంకటేశ్వర స్వామి వారి కోవెల్లో చేతికి కడియం వేయించామ్.
మందు కొట్టనని ప్రమాణం చేయిస్తూ…తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకు వస్తే గానీ..మళ్ళీ మందు కొట్టకూడదని
దేముడికి దణ్ణం పెట్టించాం..
మరో సంవస్తరమ్ వరకూ మందు జోలికి వెళ్లే అవకాశం ప్రస్తుతానికి లేదు..
మా వైపు వెంకన్న మీద ఒట్టు పెడితే దాటడానికి అంటే బ్రేక్ చెయ్యడానికి బయపడతారు..
ప్రస్తుతానికి మా వాడు ఆరు నెలలు గా మందు జోలికి వెళ్లలా ..చాలా హిప్పీ గా ఫీల్ అవుతున్నాడు..
డబ్బులు మిగిలి పోతున్నాయి..కదా..గొడవలు లేవూ..
నాకు ఈ రొందు విష్యాలు చాలా satisfaction ఇచ్చాయి…
అందుకే అంటున్నా ..నేను పే…ద్ద…సంస్కర్త నయ్యా అనీ…
మన చుట్టూ చాలా మంది కి కొంచం గైడెన్స్ ఇస్తే ముందుకు చొచ్చుకు పోయే వారు ఉంటారు..
వాళ్ళకి మీ అమూల్యమైన సహాయాన్ని కొంచం అందించండి..

ప్రకటనలు

7 Comments

 1. ఊహూ మా వాడు రెందేళ్ళ పాటు ప్రతీ రోజు ఉదయమే ఈ రోజు నుంచీ మందు మానేయాలనుకునే వాడు..
  సాయంత్రం ఫస్ట్ పెగ్ వేసే వరకూ…అలా అనుకుంటూ నే వుండే వాడు..మారాలని బలమైన కోరిక వుండేది..
  వెండి కడియం కోసం 300 రూపాయలు..వాడి చేతిలో పెట్టి అర్జెంట్..అనీ..వాణ్ని.. లాక్కు పోయామ్..
  ఆ రోజు అలా చేసి వుండక పోతే ఈ పాటికి ఒ వంద కావాలి సార్ అంటూ ఈ రోజు ఈవినింగ్ కూడా మందుకి
  డబ్బులు పట్టుకు పోయేవాదేమో…
  అయితే వాడికి మానాలని లేకుంటే?మేము చెప్తే మారే వాడ౦టారా??
  ఏమో ఇలాంటి అనుమానా లొస్తే జుట్టు పీకేసుకోవడం అలవాటయ్యింది నాకు….ఈ మద్య..
  అందుకని నాకు మరిన్ని అనుమానాలు రానీకండి ప్లీజ్…

 2. kvsv gaaru బ్లాగ్లు చదవడానికి బాగా అలవాటు పడిపోయాను. నాకు ఏదైనా ఓ వెండి కడియం చేయిద్దురు.

  మీ ప్రయత్నం అభినందనీయం. మంచి చెప్పడంలో తప్పు లేదు. వినడం వినకపోవడం అవతలి వారి ఇష్టం.

 3. బ్లాగులు మాని బార్ల వైపు వెడతారా ఏమీ?
  నేను కామెంట్ పెడితే ఆకాశ రామన్న పేరు పై వస్తూంది ఏమిటండీ?
  వున్న కొద్ది జుత్తూ ఇక మిగిలేలా లేదు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s