ఏవడబ్బా సొమ్ము??


చాలా కాలం గా ఈ విష్యమై పోస్ట్ రాద్దా మనుకుంటున్నా ..ఈ లోపే పేపర్ లో వచ్చింది…టైమ్ లేక మొత్తం విషయం చెప్పలేక పోతున్నా గానీ ఈ రీ ఎంబర్స్మెంట్ డబ్బులు వస్తాయన్న దుర్భుద్దితో కుప్పలు తెప్పలుగా కాలేజీ లు మొదలె ట్టెస్తున్నారు ..తర్వాత ఇళ్ళకు పోయి పల్లే టూల్లోళ్ళని పిలల్ని మీరు ఏ మాత్రం ఫీజులు కట్టక్కర్లేదు అంటూ జాయిన్ చేసుకుని నాసి రకం చదూలు చెప్తూ ఈ పిల్లల పేరు మీద గవర్నమంటు ఇచ్చే సొమ్ముల్ని రే ఎంబర్స్మెంట్ పేరుతో., జేబులో వేసుకుని ఒ వెలుగు వెలిగి పోతున్నారు..
ఇదో రకం కొత్త సంపాదన …ఈసీ మనీ…వీధికో iti..పాలి టేక్క్నిక్ కాలీజీ…మెడికల్ కి సంబందించిన లాబ్ టెక్నీషేయన్ .anm…కోర్సుల కాలేజీ ఈ జాబితా లోంచి పుట్టుకొస్తున్నవే వీధికి నాలు గైదు కాలేజీ లు పుట్టుకొస్తున్నాయి..గమనించండీ..

ఈ సొమ్ము అంతా ఎవరిది?ఎవరి జోబుల్లోకి వేడుతూంది? ఈ ఫీజులప్రభుత్వం చెల్లించే విషయం లో ఒక సరయిన పద్ధతి ని ప్రకటించాలి…కుక్కల్లా రాత్రీ పగలూ నానా చాకరీ చేసి సంపాదించిన దాంతో పన్నులు కడితే…ఆ సొమ్మను ప్రతీ బేవార్సు గాడూ రకరకాల పేర్లతో కాలేజీలు పెట్టి దొబ్బేయదాన్నీ తీవ్రంగా వ్యతిరేకించండి…ఈ డబ్బు..మన రక్తం..మన చమటానూ..
ఒక కాలజీ పెడితే iti గానీ పాలీ టెక్నిక్ గానీ..పారా మెడికల్ కోర్సులు గానీ..ఎంత మిగులుతుందో కాళీ గా వున్నపుడు మీకు లెక్కలతో వివరిస్తా…
ఈ రోజు వచ్చిన వార్త… కొంత బాగం క్రింద చూడండీ..

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి కాలేజీలకు ఫీజు రియంబర్స్‌ మెంట్‌ చెల్లింపులు హుళక్కే. దీంతో చిన్న చిన్న వృత్తి విద్యా కాలేజీలు సగం వరకు మూతపడే ప్రమాదం ఏర్పడ నుంది. ఫీజు చెల్లింపు విషయంపై మంత్రులు తీవ్రంగా చర్చించారు. దీని ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకా యిలు చెల్లించడం ప్రభుత్వం వల్ల కాదంటు చేతులు దులిపేసుకోవడానికి సర్కారు సన్నద్ధంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కారణం ప్రతి ఏడూ ట్యూషన్‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇవ్వడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా పరిణమించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి, ఇక ఫీజు బకాయిలు చెల్లించే సామర్థ్యం ఎక్కడుందని ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి చెప్పారు. సంబంధిత మంత్రి వర్యులు కూడా ఇదే విషయాన్ని కాదనలేక పోవడం గమనార్హం.

కారణం వృత్తి విద్యా కాలేజీలలో చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయి లు 2011 విద్యా సంవత్సరం తో కలుపుకుని రూ.5,500 కోట్లకు చేరుకుంటుంది. దీం తో ప్రభుత్వ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఆలో చిస్తున్నా వారికి ఏమీ తట్టడం లేదు. 2009-2010 విద్యా సంవత్సరంలో సకాలంలో ఫీ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించక పోవడంతో ఫీజు బకాయిలు రూ.2,500 కోట్లు వరకు ఉన్నాయి. ఇవి కాకుండా రానున్న విద్యా సంవత్స రం కలుపుకుంటే మరో రూ.3,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడనుంది. ఈ మొత్తం బకాయిలు కలిపితే రూ.5,500కోట్లకు చేరుకుంటుంది.

ప్రకటనలు

4 Comments

  1. హ్మ్మ్. ఇలాక్కూడా సాగుతోందన్నమాట దోపిడీ. ఏమోలెండి – మనకు ఆ అవకాశం రాక ‘వృద్ధ నారీ పతివ్రత’ అన్న టైపులో నిజాయితీపరులుగా మిగిలిపోయామేమో.

  2. ఏమీ మిగిలిపోలేదు సార్…ఒక iti నో పేరామెడికల్ కాలేజీ నో ట్రై చేద్దామనుకుంటున్నా…ఈజీ మనీ…స్టూడెంట్ లను తోలుకొచ్చి పెడితే సరి ఈ ఆడంగి గవర్నమెంట్ లే ఫీజులు కడతాయి వాళ్ళ తరుపున…లేకుంటే వాళ్ళకు వోట్లు పడవు…సదూలు ఎలానూ చెప్పక్కరలేదూ…సర్టిఫికేట్లు ఇచ్చి పంపేస్తే సరీ..ఒ నలుగురు టీచరమ్మల్ని ట్యూటర్లుగా పెట్టుకుంటే అన్నీ పనులూ చేసి పెడతారు కూడా..హీ…హీ….

  3. మీకభ్యంతరం లేకపోతే మనిద్దరం కలిసి అంబాజీపేటలో కోనసీమ పాలిటెక్నిక్ కాలేజి పెడదామా. ఈ జీతం డబ్బులు సరిపోవట్లేదు మరి. కావాలంటే ఓ నలుగు టీచరమ్మలని అపాయింట్ చేద్దాం సరదాగా. చక్కగా ఓ ఎకరం కొబ్బరి తోట కూడా వేసుకోవచ్చు. ఆలసించినా ఆశాభంగం.

  4. మరదే తొందర…దాంతో పాటు ఒ ఇంజనీరింగ్ కాలీజీ…ఒ ఐ.టి.ఐ..ఒ పారా మెడికల్ కాలీజీ…బొల్డు డబ్బులు నోల్ల్కోవచ్చు..నాను..డైరెట్రూ…మీరు సేర్మానీ…శరత్ గారు…కరస్పాండెంటీ….గవర్నమెంటీ వుందిగా రీ యంబర్స్మెంట్ కింద ఫీజులు ఇవ్వడానికి…పన్నుకట్టే జనాల పీజులు తీసి మరీ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s