పిల్లలు కవలపిల్లలు గ్యారంటీ.అట..


twins-lసంతానం కలగటం లేదా… మా ఆసుపత్రికి ఒక్కసారి విచ్చేయండి… మా వైద్య విధానంలో తప్పకుండా సంతాన సాఫల్యం కలుగుతుంది… అని ప్రచారం చేసుకునే అనేక మంది వైద్యులను తరచూ చూస్తూనే ఉంటాం. సంతాన సమస్యలతో బాధపడుతున్న చాలామంది దంపతులు చిన్నాచితకా వైద్యుల నుంచి సూపర్‌, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల వరకు తిరిగి వేలు… లక్షల రూపాయలు తగలేయటం… ఫలితం లేకపోతే నిరాశ చెందటం మామూలే. ఈ నేపథ్యంలో… ‘ఇక్కడ నీటిని తాగండి… కవల పిల్లలు గ్యారంటీ…’ అని భరోసా ఇస్తున్నారు దొడ్డిగుంట గ్రామస్తులు. కేవలం మాటలే కాకుండా వందల సంఖ్యలో కవల పిల్లలు జన్మించిన సంఘటనలు వీరి మాటలపై విశ్వాసం కలిగించకమానదు.

* బావిలో నీటికి మహిమాన్విత శక్తి
* దశాబ్ధాలుగా ప్రజల నమ్మకం
* దంపతులలో పెరుగుతున్న ఆసక్తి
* దొడ్డిగుంట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు

కవల పిల్లలు అనగానే ఎక్కడా అని ఆతృతగా చూస్తాం. ఇతిహాసాల్లో రామాయణంలోని లవకుశల దగ్గర నుంచి నిన్నమొన్నటి వాణి, వీణ వరకు వారికున్న ప్రత్యేకత అలాంటిది మరి. ఎక్కడో ఒకరిద్దరు కవలలు ఉంటేనే అరుదుగా చూస్తాం మనం. అటువంటిది అనేకమంది కవలలు ఒకే గ్రామంలో ఉంటే అది వింతే కదా మరి. ఆ వింతకు వేదికగా మారింది మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో దొడ్డిగుంట గ్రామం.

Rangampeta-welవ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రంగంపేట మండలంలో పెద్ద దొడ్డిగుంట, చిన్న దొడ్డిగుంట గ్రామాలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగంపేట నుంచి ఈ గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 60కి పైగా కవలలు పుట్టారన్నది గ్రామస్తుల అంచనా. కవలలుగా పుట్టిన వారికి మళ్ళీ కవల పిల్లలు జన్మించటం మరో విశేషం. ఇక్కడి వాతావరణంలో ఏ శక్తి ఉందో గానీ మానవులకే కాకుండా పశువులకు కూడా కవల దూడలు, పెయ్యలు పుడుతున్నాయి. దశాబ్దాల నుంచి ఇలా జరుగుతుండటంతో రాష్ట్రంలోనే దొడ్డిగుంట గ్రామానికి విశేష గుర్తింపు లభించింది.

వెలుగు చూసిందిలా…
దశాబ్దకాలం వరకు ఈ విషయం వెలుగులోకి రాకపోవటం గమనార్హం. ఈ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేయటానికి వచ్చిన బండి శ్రీనివాసమూర్తి కృషి ఫలితంగా శాస్త్ర విజ్ఞానానికి అందని ఈ విషయం బాహ్య ప్రపంచం ముందుకొచ్చింది. జనాభా లెక్కల ప్రకారం గ్రామంలోని ఇంటింటికి తిరిగిన ఆయనకు ఓ విచిత్రమైన అనుభూతి ఎదురైంది. చాలా ఇళ్ళలో ఒకే వయసు కలిగిన ఇద్దరు ఆయనకు తారసపడ్డారు. దీనిపై ఆరాతీసిన ఆయనకు వీరంతా కవలలుగా జన్మించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధతో వ్యక్తిగతంగా కవలలపై అధ్యయనం చేశారు.

twins2నెల వయసు కలిగిన చిన్నారుల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకు సుమారు 30 జంట కవలలు గ్రామంలోనే తారసపడ్డాయి. ఇంకా 30 జంట కవలలు వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరుగాక అనేకమంది కవలలు కాలధర్మం చెందినట్లు ఆయన అధ్యయనంలో వెల్లడైంది. విశేషం ఏమిటంటే అదే గ్రామంలో కొంత కాలం పాటు పనిచేసిన శ్రీనివాసమూర్తికి కూడా కవల పిల్లలు జన్మించారు. తమ వంశంలో ఇప్పటివరకు కవలలు జన్మించిన సంఘటనలు లేకపోవటంతో.. కవల పిల్లలు జన్మించటానికి ఈ గ్రామానికి ఉన్న అంతుతెలియని శక్తే కారణమని ఆయన విశ్వసించారు.

twins-animalఅదంతా బావి నీటి మహిమే…
ప్రధానంగా గ్రామంలోని పాపయ్య చెరువు గట్టుపై ఉన్న బావిలోని నీటిని తాగటం వల్లనే కవలలు పుడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రసార మాద్యమాల ద్వారా ఇప్పటికే ఈ విషయానికి విస్తృత ప్రచారం లభించింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో దంపతులు టిన్నుల ద్వారా ఈ నీటిని తీసుకు వెళుతున్నారు. ఇక్కడకు రాలేని దంపతులు తమ బంధువుల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా సంతానం లేని దంపతులు ఈ నీటిని స్వయంగా వచ్చి తోడుకొని వెళ్ళటం విశేషం. దొడ్డిగుంట చుట్టపక్కల గ్రామాల ప్రజలు కూడా సంతానం కోసం ఈ నీటిని దివ్యౌషధంగా వినియోగిస్తున్నారు.

twinsఆడ కవలలే ఎక్కువ..
కవల పిల్లలు పుడుతున్నప్పటికీ… ఎక్కువగా ఆడ పిల్లలు జన్మిస్తుండటంతో పలువురు దంపతులలో అసంతృప్తి కనిపిస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న తాము పిల్లలను పోషించలేకపోతున్నామని కొంతమంది ‘మేజర్‌న్యూస్‌’ వద్ద వాపోయారు. దీనివల్ల పిల్లలకు సరైన పౌష్ఠికాహారం అందకపోవటంతో చిన్నతనంలోనే పలువురు పిల్లలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడి నీటిని తాగటం వల్ల పిల్లలు పుట్టారని అనేకమంది దొడ్డిగుంట గ్రామస్తులకు మిఠాయిలు పంచిపెట్టడం తరచుగా ఇక్కడ కనిపిస్తుంటుంది. బావి నీటికి విశేష శక్తి ఉందని నమ్ముతున్న వారుంటే… ఇదంతా వట్టి బూటకమని కొట్టిపారేసే వారు లేకపోలేదు. కవల పిల్లలు పుట్టటానికి… ఇక్కడి నీటికి అసలు సంబంధం లేదని శాస్ర్తీయ, హేతువాదులు వాదిస్తున్నారు. శాస్ర్తీయ రుజువులు లేకపోయినప్పటికీ… ఏ పుట్టలో ఏ పాముందోనన్న విశ్వాసంతో అనేకమంది ఈ నీటిని అమూల్యంగా భావిస్తున్నారు. దొడ్డిగుంట బావికి విశేష ప్రాచుర్యం లభించటంతో నీటిని తీసుకు వెళ్ళేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

twins1ఒకరి జబ్బు చేస్తే… మరొకరికి…!
సాధారణంగా కవలలిద్దరిలో ఒకరికి జబ్బు చేస్తే… మరొకరికి కూడా జబ్బు చేస్తుందని అనుకుంటుంటారు. కాగా అదంతా అపోహ అని కొట్టిపారేసేవారున్నారు. ఈ గ్రామంలో ఉన్న కవల పిల్లల తల్లిదండ్రులను సంప్రదిస్తే… అది నిజమని నమ్మకతప్పదు. స్థానికంగా ఇక్కడ నివాసముంటున్న సూర్యారావు, వీరాయమ్మ దంపతులు వాళ్ళ పిల్లల విషయంలో ఒకరికి జబ్బుచేస్తే మరొకరికి కూడా చేసేదని చెప్పారు.
– దేవిన శ్రీనివాస్‌, మేజర్‌న్యూస్‌, రంగంపేట, తూర్పు గోదావరి జిల్లా

బావిని పరిరక్షించాలి…
ఈ నూతిలోని నీటిని నిత్యం అనేకమంది పిల్లలు లేనివారు తీసుకు వెళతారు. దీంతోపాటు వేసవి కాలంలో మూడు గ్రామాల ప్రజలు ఇదే నీటిని తాగుతాం. గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు కనీసం బావిని పరిరక్షించే చర్యలు చేపట్టాలి. చుట్టూ సిమెంట్‌ చేయిస్తే బావి బాగుపడుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ బావి పూడిపోయే ప్రమాదం ఉంది.

chyuthalakshmiదూర ప్రాంతాల వారు తీసుకు వెళతారు – కె.అచ్యుతలక్ష్మి,
గృహిణి, దొడ్డిగుంట
ఈ బావి వల్ల మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు రావటం ఆనందంగా ఉంది. మా బంధువులు కొంతమందికి ఈ నీరు పంపించాం. హైద్రాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు లాంటి దూర ప్రాంతాలకు కూడా ఈ నీటిని తీసుకు వెళుతుంటారు.

krishnamoorthyఖచ్చితంగా పిల్లలు పుడతారు… – కృష్ణమూర్తి, దొడ్డిగుంట
ఈ బావి నీరు తాగిన వారికి పిల్లలు పుడతారని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దూర ప్రాంతాల వారికి కొందరికి ఈ నీటిని టిన్నులతో పంపించాను. వారందరికీ పిల్లలు పుట్టారు. దీనిపై పరిశోధన చేసి శాస్ర్తీయమైన గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది.
[సూర్య  ఆదివారం పేపర్ నుండి]

5 Comments

  1. ఆ ఊరు మా ఊరికి సుమారు 15 కి.మి ఉంటుంది. నేను విన్నాను, ఆ ఊరు వెళ్ళాను కాని నీళ్ళు త్రాగలేదు. ఆ ప్రక్క ఊరిలో ఉన్న మా బంధువులని అడగాలి ఈ విషయం గురించి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s