రాచబాటలో రారాజు..కొన్ని కొన్ని విష్యాలు ఇన్స్పై రింగ్ గా వుంటాయి..

ఇంతకు మునుపు చదివి వున్నా..మళ్ళీ  చదవాలనిపించింది..
సండే స్పెషల్ సూర్య దినపత్రిక నుంచి..
అంతా చదివాక అనిపించింది..మన  వాళ్ళకూ  వున్నాయ్ బొలెడు అడ్డ దారులు..అనీ..

లక్షల కోట్లు సంపాదించినా సింహభాగం నిధుల్ని సేవాకార్యక్రమాలకు దానం చేస్తానని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు… లక్షల కోట్లకు అధిపతైనా ఆయనలోని నిరాడంబరత, పాటించే వ్యాపార నియమాలు యువతరానికి ప్రేరణగా నిలుస్తాయి… అతనెవరోకాదు… జీరో స్థాయి నుండి హీరోగా ఎదిగిన వారెన్‌ బఫెట్‌. ప్రపంచ సంపన్నుడు… సాక్షాత్తు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ చేత ‘నా గురువు’ అని పొగిడించుకున్నాడంటే విశ్వవిపణిలో బఫెట్‌ స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బఫెట్‌ విజయాలు వాటి వెనుక నీతి సూత్రాలు పాటిస్తే ఎవరైనా కోటీశ్వరుడు అవ్వచ్చు. ఆయన గురించి ఇప్పటి వరకు లోకానికి తెలియని అతని వ్యక్తిగత విషయాలు ఈవారం ‘టర్నింగ్‌ పాయింట్‌’ లో..
Warren-Buffetఇంటింటికీ తిరుగుతూ న్యూస్‌పేపర్‌, చూయింగ్‌గమ్‌, కొకొకోలా సప్లై చేసిన ఓ యువకుడు నేడు ప్రపంచం సంపన్నుల జాబితాలో మూడవస్థానంలో నిలిచాడు. ఒకనొక సందర్భం (2008) లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను సైతం తోసిరాజని మొదటి స్థానాన్ని ఆక్రమించాడం టే దాని వెనక ఎంతో కృషి, పట్టుదల ఉంటేగాని సాధ్యపడదు. మూమూలు గుమస్తా స్థాయి నుండి బహుళజాతి సంస్థల అధిపతుల వరకు ఆయన వ్యాపార నియమాలు ఆ చరణయోగ్యం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన పాటించిన నియమాలు ఆచరిస్తే… ఎవరైనా అచిరకాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. వ్యాపార రంగానికే భగవద్గీత లాంటి ఆయన సూక్తులు సదా అనుసరనీయం. అవేంటో మీరే చూడండి.ఈ పది సూత్రాలు పాటిస్తే… కోటీశ్వరుడవ్వొచ్చు.

చిరుప్రాయంలో షేర్‌ మార్కెట్‌లోకి…
1. 11 ఏళ్ల చిరుప్రాయంలోనే తొలిసారి షేర్‌ మార్కెట్లోకి అడుగిడి కొన్ని షేర్లు కొన్నాడు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయిందని వారెన్‌ బాధపడుతుంటాడు. ఇంకొంచెం ముందే అందులో కాలుమోపితే మరె న్ని శిఖరాల్ని అధిరోహించే వాడినోనని ఆయన ఆలోచన.

warrenbuffettsనీతి: ఆరోజుల్లో అన్నీ కారు చౌకగా లభించేవి. అందుకే బఫెట్‌ మరికాస్త ముందు పుట్టాల్సిందని అనుకునే వాడట. గడిచినకాలం తిరిగిరాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పిల్లల్ని వ్యాపారం చేయడానికి ప్రోత్సహిం చండి. ఓరోజు వారు బఫెట్‌ను మించిపోతారేమో!

పేపర్‌ బోయ్‌గా పనిచేసి…
2. 14 ఏళ్ల కౌమార దశలోనే చిన్న ఫామ్‌హౌజ్‌ను కొనుగోలు చేశాడు. ఎలా అనుకుంటున్నారా? న్యూస్‌పేపర్‌ బోయ్‌గా పనిచేసి వచ్చిన డబ్బులతో.

నీతి: పైసా పైసా కూడబెడితే రూపాయి, రూపాయి రూపాయి కలిపితే వేలు, లక్షలు, కోట్లు అవుతాయి. జీవితంలో పైకెదగాలంటే ప్రతిఒక్కరూ ఈ నియమాన్ని పాటించి తీరాల్సిందే. కాబట్టి మీ పిల్లలకి ఇప్పటి నుంచీ ఆ అలవాటును నేర్పించండి.

కాంపౌండ్‌వాల్‌ లేని ఇంట్లో…
3. కోట్లు సంపాదించినా వారెన్‌ బఫెట్‌ నేటికీ ఒమాహాలోని అతిసాధారణ త్రీ బెడ్‌రూం ఇంట్లోనే నివసిస్తారు. ఈ ఇంటికి కాంపౌండ్‌ వా ల్‌, ఫెన్సింగ్‌ కూడా లేకపోవడం గమనార్హం. 50 ఏళ్ల క్రితం పెళ్లైన కొత్తలో ఈ ఇంటిని కొ న్నాడట. అందులో ఆయనకు సౌకర్యంగా ఉందని, ఆయనకు అది స్వర్గంలా ఉంటుందని, అలాంటప్పుడు లగ్జరీ ఇంటిని కొనాల్సిన అవసరమేముందని ఎదురుప్రశ్నిస్తారు బఫెట్‌.

నీతి: అవసరానికి మించి ఏదీ కొనకూడదు. పిల్లలకి కూడా ఈ గుణాన్ని అలవర్చండి.

warren-buffet-and-bill-gateఆడంబరాలకు దూరం…
4. నేటికీ ఆయన పదేళ్ల క్రితం కొన్న కారును స్వయంగా నడుపుకుంటూ ఎక్కడికైనా వెళ్తారు. డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వంటి మందీ మార్బలం ఆయనకు ఇష్టం ఉండదట.

నీతి: మీరు మీలాగే జీవించండి. అనవసర ఆడంబరాలు, ఢాంబికాలకు పోకండి.

బడ్జెట్‌కు లోబడి ఖర్చు…
5. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్‌ జెట్‌ విమాన సంస్థ బఫెట్‌ సొంతం అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయన ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో ఏనాడూ ప్రయాణం చేయలేదు.

నీతి:వ్యాపారంలో పైకెదగాలంటే పొదుపును అలవర్చుకోవాలి. అనవసరంగా ఖర్చు చేయకుండా వీలైనంత వరకు బడ్జెట్‌కు లోబడి ఖర్చు చేయండి. డబ్బును ఆదా చేయడం ముఖ్యం.

అన్నింటిలో తలదూర్చడు…
6. బఫెట్‌ ఆధీనంలో ఉన్న బర్క్‌షైర్‌ హాత్‌వే అనే ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా 63 కంపెనీలు పనిచేస్తున్నాయి. అంతమాత్రానికి ఆ కంపెనీలపై ఆజమాయిషీ నెపంతో చీటికీ మాటికీ వాటి కార్యనిర్వాహక పనుల్లో కలుగజేసుకోవడం బఫెట్‌కు నచ్చదు. సంవత్సరానికి కేవలం ఒక్కటంటే ఒక్క లెటర్‌ ఆయా కంపెనీల కార్యనిర్వహణాధికారులకు రాస్తాడు. ఆ లెటర్‌లోనే సంవత్సరానికి సరిపడా కంపెనీ కార్యాచరణ ప్రణాళికలు, లక్ష్యాలు ఉంటాయి. మీటింగులు, వీడియోకాన్ఫరెన్స్‌ గట్రా ఏర్పాటు చేయడు.

నీతి: వ్యాపారంలో పైకి రావాలంటే సరైన వారిని సరైన స్థానాల్లో కూర్చోబెట్టాలి.

షేర్‌ హోల్డర్లే దేవుళ్లు…
7. ఆయన ఆధ్యర్యంలో నడుస్తోన్న కంపెనీ కార్యనిర్వహణాధికారులకు కేవలం రెండే రూల్స్‌ విధించాడు. అవి:
రూల్‌ నెం.1: కంపెనీ షేర్‌ హోల్డర్లే మనకు ఆయువుపట్టు వంటి వారు. కాబట్టి వారి నయా పైసా కూడా దుర్వినియోగం చేయడం, వారికి నష్టం కలిగించే పనులు చేయకూడదు.
రూల్‌ నెం.2: అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ రూల్‌ నెం.1ను మరిచి పోకండి.

నీతి: లక్ష్యాల్ని నిర్దేశించుకోండి. వాటిని సరిగ్గా అమలు చేయండి. చేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించండి.

warren-buffetts-houseపార్టీలకు దూరం…
8. కుబేరుడైనా సాధారణ జీవితానికి ఇష్టపడే బఫెట్‌కు అంతే సాధారణంగా గడపడానికే మక్కువ చూపుతాడు. అందుకే సెలబ్రిటీస్‌ పార్టీలు, మీటింగ్‌లకు ఆమడ దూరంలో ఉంటారు. ఆఫీసు పని ముగించి ఇంటికొచ్చాక వేరే వ్యాపకాలు ఉండవు. టీవీ ముందు కూర్చొని పాప్‌ కార్న్‌ తింటూ కాలక్షేపం చేస్తాడట.

నీతి: ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలి. ఎదుటివారిని ఆకర్షించడానికి ప్రయత్నించకండి. మీకు ఏది ఇష్టమో అదే చేయండి. ఇతరులకోసం మీ పద్ధతుల్ని మార్చుకోకండి.

నో సెల్‌ఫోన్‌…
9. సాఫ్ట్‌వేర్‌, షేర్‌ రంగాల్లో వ్యాపారం చేస్తున్నప్పటికీ వారెన్‌ బఫెట్‌ ఆఫీసులో నేటికీ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు దర్శనమీయవు. ఇక సెల్‌ఫోన్‌ను ఆమడ దూరంలో పెడతాడట.

నీతి: సైన్స్‌, టెక్నాలజీ మన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నాం. అంతేగానీ వాటికి బానిస కాకూడదు.

బిల్‌గేట్స్‌ని మెప్పించి…
10. మొదటిసారి బిల్‌గేట్స్‌ వారెన్‌ బఫెట్‌ను కలుసుకోవాడినికి సందేహించాడట. ముక్కూమొహం తెలియని వ్యక్తితో మాట్లాడటమేమిటని ముక్తసరిగా మాట్లాడుదామని బిల్‌గేట్స్‌ లోలోపల అనుకున్నాడట. అందుకే వారి మొదటి పరిచయ కార్యక్రమానికి బిల్‌గేట్స్‌ కేవలం అరగంట సమయాన్ని కేటాయించాడట. కానీ ఆ సమావేశం ఏకంగా పదిగంటలకు పైగా సాగిందట. బఫెట్‌ తెలివితేటలు, వ్యాపారదృక్పథం, ఆలోచనా శక్తిని చూసి ఆశ్చర్యపోవడం బిల్‌గేట్స్‌ వంతయింది. ఆనాటి నుండి ఈ నాటి వరకు బఫెట్‌ను గురువుగా అంగీకరిస్తారు బిల్‌గేట్స్‌.
నీతి: ఎప్పుడూ ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకండి.

ఈ తరం యవతకు బఫెట్‌ ఇచ్చే సందేశం…
warrenbuffett-bilgates* బ్యాంకు రుణాలు, క్రెడిట్‌ కార్డులకు ఆమ డ దూరంలో ఉండండి. మీరే పైసా పైసా కూడబెట్టి ఇన్వెస్ట్‌ చేయండి.
* డబ్బు మనిషిని సృష్టించలేదు. మనిషే తన అవసరాలకోసం డబ్బును సృష్టించాడు.
* మీ జీవితం అమూల్యమైంది. దానిని సరిగా ఎంజాయ్‌ చేయండి. వీలైంనంత సాదాగా జీవితాన్ని గడపండి.
* ఇతరుల మాటల్ని నమ్మకండి. ‘వినదగు నెవ్వరు చెప్పిన…’ పద్యాన్ని గర్తుంచుకోండి. ఎవరెన్నె చెప్పినా చివరకు మీ బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
* బ్రాండ్‌ ఐటమ్స్‌ అంటూ వేలం వెర్రిగా కొనకండి. మీ శరీరానికి నప్పే ఎలాంటి వస్తువులులైనా కొనడానికి సంకోచించండి.
* అవసరంలేని వస్తువులపై వృథాగా ఖర్చుచేయకండి. నిజంగా మీకు ఉపయోగపడతాయనే వస్తువుల్నే ఆచితూచి కొనండి.
* ఈ జీవితం మీది. మీరే దానికి బాస్‌లు. మరి ఎవరో వచ్చి మీపై ఆధిపత్యం చెలాయించడం ఎందుకు. ఆ అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకండి. స్వతంత్రంగా బతకండి.
– ఎస్‌.కె

ప్రకటనలు

5 Comments

  1. బాగా ఆచరించాల్సినవి, నా మనస్తత్వవం,నా పద్ధతి ఇంచు మించు బఫెట్ వారివి లాగే ఉన్నాయి. గొప్ప కోసం చెప్పటం కాదు.. నిజం. కృతజ్ఞతలు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s