చెత్త వెధవాయ్..లు..


సరయిన  సౌకర్యాలు లేని కారణంగా సీట్ల  సంఖ్య తగ్గిష్తామనడం  ఎవరూ తప్పు పట్టరు.అన్నిటినీ పూర్తి చేసి సీట్లను పునరుద్ధరించ మనడం లో తప్పు లేదు..ఏ విధమైన సౌకర్యాలు లేని ప్రమాణాలు లేని చదువులతో  ఎలాంటి విద్యార్ధులు తయారవుతారో తెలీంది కాదు కానీ మన రాజకీయులకు రగడ కావాలి గానీ
మిగతావి అనవసరం…ఈ విషయం లో ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ సమర్దించ్గాలి..పిచ్చ రాజకీయాలు చేసే వెదవల్ని మొహం మీద వూమ్మేయాలి..వివరాలు పరిశీలించండి… 

నాణ్యత తగ్గకూడదనే సీట్ల తగ్గింపు!ట్రిపుల్ ఐటిపై మంత్రి మోపిదేవి

April 24th, 2010

గుంటూరు, ఏప్రిల్ 23: రాష్ట్రంలో గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతోనే ట్రిపుల్ ఐటిలను ఏర్పాటు చేశామని, ఈ లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఇటీవల సీట్లు తగ్గించినట్లు రాష్ట్ర సాంకేతికవిద్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మంత్రి మోపిదేవి విలేఖరులతో మాట్లాడుతూ బ్యాచ్‌కు ఆరువేలమంది చొప్పున ఇప్పటికే 12వేలమంది ట్రిపుల్ ఐటిల్లో విద్యనభ్యసిస్తున్నారని, ఈ ఏడాది మరో ఆరువేలమందిని అనుమతిస్తే ఆ సంఖ్య 18వేలకు చేరుతుందని తెలిపారు. అయితే 18వేలమందికి సరిపడా హాస్టల్ వసతి, ఇతర వౌలిక సదుపాయాలు ట్రిపుల్ ఐటిల్లో లేవని అన్నారు. అప్పటికీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ట్రిపుల్ ఐటిల్లో ఒక్కొకచోట వెయ్యిమందికి ఈ ఏడాది అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ట్రిపుల్ ఐటికి అసలు గుర్తింపేది?
నూజివీడు: రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభించిన ట్రిపుల్‌ఐటిలకు ఇంతవరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) గుర్తింపు లేదని కృష్ణాజిల్లా మైలవరం, నూజివీడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చిన్నం రామకోటయ్య పేర్కొన్నారు. 

 హైదరాబాద్, ఏప్రిల్ 23: అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీల్లో మూడు వేల సీట్లను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ నిర్ణయంపై ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికలో ‘పిటీ’ అంటూ రాయడం పట్ల ముఖ్యమంత్రి కె రోశయ్య మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తనను కలిసిన మంత్రుల వద్ద ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ‘ఏమిటీ ఆ రాతలు, పిటీనా? ఇది నా ఒక్కడి నిర్ణయమా? మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం కదా,మీరు ప్రెస్ కాన్ఫ్‌రెన్స్ పెట్టి వివరించండి’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్‌లోను, సాంకేతిక విద్యా శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ గుంటూరులోను విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s