కొత్త కారు ..ఫోర్డ్ వారి ఫిగో .


ఈ కారు నేను  స్వయంగా  చూశా చాలా బావుంది..
మీరు కూడా టెస్ట్ డ్రైవ్ కి వెళ్లండి..[క్రింది వివరాలు సూర్య దిన పత్రిక నుండి]
ఫొర్డ్‌ నుంచి… “ఫిగో” చిన్నకారు!చిన్న కుటుంబాలకు సరిపడేలా కంపెనీలు సరికొత్త కార్లను తయారుచేస్తున్నాయి. కారులో తిరగాలనుకునే మధ్యతరగతి ప్రజల కలలు నెలవేరేలా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. ఈ తరుణంలో ఫోర్డ్‌ సంస్థ ‘ఫిగో’ పేరుతో చిన్నకారును హైదరాబాద్‌ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. నగరాల్లో నివసించే వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ కారు రూపుదిద్దుకుంది. ఆ కారు వివరాలు ఈ వారం ‘న్యూలుక్‌’లో మీకోసం…

figoఅమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘ఫిగో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్తగా విడుద లైన ఫిగో మోడల్‌ కారు 1.2 లీటరు, 1.4 లీట ర్‌ పెట్రోల్‌, డీజిల్‌ వర్షన్‌లలో లభ్యమవుతోం ది. ఎంట్రీ లెవల్‌ పెట్రోల్‌ వర్షన్‌ ఫిగ్‌ కారు ధర రూ.3.5లక్షలు కాగా, డీజిల్‌ కారు ధర రూ. 4.48 లక్షలుగా ఉంది. 2007 సంవత్సరంలో చిన్నకారు ఫిగో తయారీ పనులను ప్రారంభిం చిన ఫోర్డ్‌ సంస్థ గత ఏడాది సెప్టెంబరులో పూర్తి చేసింది. సుమారు 2లక్షల యూనిట్ల వార్షిక సామర్ధ్యంగల తమ చెనై్న ప్లాంట్‌ ద్వారా ఫిగో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఫోర్డ్‌ ఎండీ మైఖేల్‌ బొనెహెమ్‌ తెలిపారు.

ఇందులోని ప్రత్యేకతలివీ…
ఫోర్డ్‌ విడుదల చేసిన ఫిగో కారులో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌, 1.4లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ ఉన్నాయి. లీటరు పెట్రోలుతో 15.6 కిలోమీటర్లు, లీటరు డీజిల్‌తో 20 కిలోమీటర్లు సులభంగా ఈ వాహనంలో ప్ర యాణించే వీలుంది. ఆకట్టు కునే వీల్స్‌, ఫ్లడ్‌లైట్లు, రాత్రిపూ ట కూడా రోడ్లపై సులభంగా ప్రయాణించే సౌకర్యాలు ఇం దులో ఉన్నాయి.
figo-features
ఆకట్టుకునే తక్కువ ధర…
మారుతీ స్విఫ్ట్‌, హుందాయ్‌ ఐ20, ఫోక్స్‌వ్యాగన్‌ పోలో కార్ల కు ధీటుగా వినియోగదారుల ను ఆకట్టుకునేలా తక్కువ ధరలకే ఈ కార్లను అందిస్తున్నామని ఫోర్డ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ బొనెహామ్‌ తెలిపారు. ఈ విభా గంపై రానున్న రోజుల్లో మరింత దృష్టిసారిస్తా మని, దేశీయ వినియోగదారులకు ఇదొక కొత్త తరహా వాహనంగా చేరుక కాబోతోందని చెప్పా రు. స్థానిక మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాల న్నదే తమ లక్ష్యమని, ఇందుకోసం ప్రతి 12 నుంచి 18 నెలల వ్యవధిలో కొత్త వాహనాన్ని ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. వచ్చే రెం డు సంవత్సరాలలో చిన్నకార్లకు భారత్‌లో రెండిం తల వ్యాపారం జరగనుందని తెలిపా రు. ఇప్పటివరకు ఈ విభాగంలో 1.22 మిలి యన్‌ యూనిట్ల విక్రయాలు జరగడంతో దేశీ యంగా చిన్న కార్ల మార్కెట్‌ 72శాతంగా ఉందని తెలిపారు.

– ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ స్టేట్‌బ్యూరో

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s