ఆర్కుట్ గురించి కొన్ని విశేషాలు..


సోషల్ నెట్ వర్కింగ్ ..ఆర్కుట్ గురించి చాలా విషయాలు తెలియచేశారు రచయిత  పండూరి రవి శంకర్  సూర్య డైలీ  ఆదివారం సంచికలో.  నేను  ఇంతకు  మునుపు  విని వుండని విషయాలు  అవ్వడం  వలన  మీతో  పంచుకుందామని  పోస్ట్  చేస్తున్నాను..

buyukkotenఎప్పుడో చిన్ననాడు విడిపోయిన బాల్యమిత్రుడిని కలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఆర్కూట్‌ను ఆశ్రయించండి. మీ పని ఇట్టే జరిగిపోతుంది. అంతేనా మీకిష్టమైనా వీడియోలు, మీ వ్యక్తిగత అంశాలు అన్నీ అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు… ఈ రోజు విద్యార్థులు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు, ఒక్కరేమిటి ఏ రంగానికి చెందినవారైనా ఉపయోగించే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌. ఆర్కూట్‌ పేరు తెలియని విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, కొలీగ్స్‌, బంధువులకు క్షణాల మీద సమాచారాన్ని చేరవేరయవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ అయిన ఆర్కూట్‌ వినియోగంలో భారత్‌ (20%) రెండవ స్థానంలో ఉండగా 51% తో బ్రెజిల్‌ తొలిస్థానంలో ఉంది. యూఎస్‌ఏ 17% వినియోగదారులతో మూడవస్థానంలో ఉంది. ఆర్కూట్‌ బుయుక్కొటెన్‌ను ప్రపంచంలో టాప్‌ బిలియనీర్ల జాబితాలో నిలిపిన ఆర్కూట్‌ ఆవిర్భావం వెనుక ఒక మహిళ స్ఫూర్తి ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఆర్కూట్‌ రూపకర్త అయిన ఆర్కూట్‌ బుయుక్కొటెన్‌ గురించి ఈ వారం ‘టర్నింగ్‌ పాయింట్‌’లో…
buyukkoten-friendsసాధారణంగా డిగ్రీ చదివే యువకులు ఏంచేస్తారో ఆ కుర్రాడూ అదే చేశాడు. మూడేళ్ల కోర్సు వ్యవధిలో అతడూ సినిమాలు, షికార్లు, గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ కాలేజీ రోజుల్ని చక్కగా ఎంజాయ్‌ చేశాడు. చూస్తుండగానే డిగ్రీ పూర్తికావచ్చింది. ఇక చివరి సంవత్సరం పరీక్షలు పూర్తవడమే ఆలస్యం. ఇంతలోనే ఆ కుర్రాడికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. ప్రాణంకంటే మిన్నగా భావించే తన స్నేహితురాలు రైలు ప్రమాదంలో చిక్కుకుపోయిందని ఆ వార్త సారాశం. వార్త విన్న మరుక్షణమే ఆ కుర్రాడి కాళ్ల కింద భూమి కంపించింది.

గుండె రాయి చేసుకుని తన ప్రియురాల్ని వెతికేందుకు దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. ళ్లకు కొవ్వొత్తులు పెట్టుకుని వెతికినా ప్రియురాలి జాడ కనుక్కోలేకపోయాడు. హాయిగా సాగిపోతున్న జీవితంలో గర్ల్‌ఫ్రెండ్‌ దూరమవడంతో ఆ కుర్రాడు విరహవేదనతో కుమిలిపోలేదు. దేవదాసులా మారి తన కెరీర్‌ను నాశ నం చేసుకోలేదు. ఎప్పటికైనా ప్రియురాల్ని కలుసుకుంటాననే గంపెడు ఆశతో ఆమె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ఇంజనీరింగ్‌ (ఐటీ-ఆర్కిటెక్ట్‌) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే గూగుల్‌లో ఉద్యోగం చేశాడు.

orkutenఆ తర్వాత ఉద్యోగాల కోసం అన్వేషించకుండా కొత్తగా ఏదైనా సాధి ంచాలని ఇంటర్నెట్‌ను ఆశ్రయించాడు. అప్పటికే నాలుగేళ్లుగా గర్ల్‌ఫ్రెండ్‌ జాడ తెలియక లోలోపల కుమిలిపోతున్న ఆ కుర్రాడు ఇంటర్నెట్‌ సహాయంతో ఆమె జాడ తెలుసుకోవాలిని నిర్ణయిం చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ను వినియోగిస్తున్న వారి వి వరాల్ని నెట్‌ డెవలపర్స్‌ సహాయంతో సేరించి వారందిరినీ ఒకే వేదిక మీదికి తీసుకువచ్చేలా జనవరి 2004లో ఠీఠీఠీ. ౌటజుఠ్ట.ఛిౌఝwww.orkut.com అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించాడు.

ఆ కుర్రాడే ఆర్కూట్‌ బుయుక్కొటెన్‌‌‌. తన పేరుమీదుగా ప్రారంభించిన ైటజుఠ్ట ప్రస్తుతం సోషల్‌ నెట్‌వర్క్‌ పోర్టల్‌కు పర్యాయపదంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందరికీ సులువుగా అర్థమయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిచడంతో అనతికాలంలోనే ఈ పోర్టల్‌కు అనూహ్య స్పందన లభించింది. మూడే ళ్ల నిరీక్షణ తర్వాత ఆ నెట్‌వర్క్‌ వారధిగా ఆర్కుట్‌ తన పాత స్నేహితురాల్ని మళ్లీ కలుసుకోగలిగాడు.

orkutఆర్కూట్‌ గురించి మరిన్ని విశేషాలు…
తప్పిపోయిన స్నేహితురాల్ని వెతికేందుకు ప్రా రంభించిన నెట్‌వర్క్‌ విస్తరణకు ఆర్కూట్‌ మూడే ళ్ల కాలంలో కొన్ని మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టాడు. ఇలా ప్రారంభమైన ఆర్కూట్‌ ప్రస్థానం నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి చివరకు ఇంటర్నెట్‌ రం గాన్ని శాసిస్తున్న గూగుల్‌ నెట్‌వర్క్‌ సీఈఓ కంట బడింది. ఓరోజు ఆర్కుట్‌కు గూగుల్‌ నుండి ఆ హ్వానం వచ్చింది. ఆర్కుట్‌ పోర్టల్‌కు ఉపయోగిం చే సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌కు అందించేందుకు ఒక బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ వచ్చింది.

ప్రస్తుతం ఆ ర్కూట్‌ గూగుల్‌ వారి ఆధీనంలోకి వెళ్లినా ప్రతీరోజూ ైటజుఠ్ట పోర్టల్‌ సందర్శించే నెటిజన్ల ఆధారంగా ఆర్కూట్‌కు ప్రతినెలా కొన్ని మిలియన్‌ డా లర్ల డబ్బు వచ్చిచేరుతుంది. ైటజుఠ్ట పోర్టల్‌ ప్ర స్థానం ఇలాగే కొనసాగితే రానున్న రెండు మూ డేళ్లలో ఆర్కూట్‌ బుయుక్కొటెన్‌ ప్రపంచంలోనే టాప్‌-1 కుబేరుడిగా ఎదగవచ్చని మార్కెట్‌ వర్గా లు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కుట్‌కు వచ్చే ఆదాయం, పోర్టలో నెటిజన్ల నుండి వచ్చే రె స్పాన్స్‌ (స్క్రాప్‌బుక్‌)ను వీక్షించడానికి 13 మంది వ్యక్తిగత సిబ్బంది, అంతేగాక ఈ పోర్ట్‌లో తన స్నేహితుల సందేశాల్ని, సలహాల్ని చూసేందుకు మరో ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ఆర్కూట్‌ బుయుక్కొటెన్‌కు ఈ పోర్టల్లో ప్రతిరోజూ 20 వేల మంది కొత్త స్నేహితులు, 85 వేల మంది కొ త్త సభ్యులు వచ్చిచేరుతున్నారట.

ఎన్నెన్నో ఫీచర్లు…
ఆర్కూట్‌లో కేవలం ఛాటింగే కాకుండా ఫొటో లు, వీడియో ఫైల్స్‌ను సైతం నిక్షిప్తం చేసుకోవ చ్చు. వాటిని ఇతరలకు చేరవేయవచ్చు. అంతే కాదండోయ్‌! గూగుల్‌ టాక్‌ను ఉపయోగించి స్నే హితులతో మాట్లాడవచ్చు కూడా. ఇంకా ఆర్కూ ట్‌ వారు అందిస్తున్న రకారకాల థీమ్స్‌తో మీ ఆ ర్కూట్‌ హోంపేజీని మీకిష్టమైన రంగుల్లో మార్చు కోవచ్చు. ఇంకా మీ స్నేహితులను, బంధువుల ను, కొలీగ్స్‌ను గ్రూపుల్లాగా సెట్‌చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లోనే కాకుండా డచ్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, చైనీ స్‌లాంటి ప్రముఖ భాషలతోపాటు ప్రపంచలోని 48 భాషల్లో ఆర్కూట్‌ సేవలందిస్తుంది. ఇందులో మనభారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళం, ఒరియా, మరాఠీ, మళయాళం, బెం గాలీ, కన్నడ భాషల్లో కూడా ఆర్కూట్‌ను వాడుకో వచ్చు. అంతేకాకుండా ఇందులో కొన్ని కమ్యూని టీలను కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ కమ్యూ నిటీలో మెంబర్‌గా ఉన్న వ్యక్తులు ఆ సంబంధిత కమ్యూనిటీ గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవచ్చు.

వివాదాలూ ఉన్నాయి…
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ కావడం వలన ఆర్కూట్‌ను కొన్ని వివాదాలూ చు ట్టుముట్టాయి. కొందరు ఆకతాయిలు ఈ నెట్‌ వర్క్‌ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కూడా ఉపయోగించడంతో ఆర్కూట్‌ వివాదాల్లో చిక్కు కుంది. కొంతమంది దొంగ పేర్లతో ప్రొఫైల్స్‌ సృ ష్టించి ఆర్కూట్‌ మెంబర్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకునే వీలుంది. అందుకే ఆర్కూట్‌ కూడా వినియోగదారులకు కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ అం దిస్తోంది. దీనిద్వారా మన పర్సనల్‌ డాటాగానీ, ఫొటోలు, వీడియోలు లాక్‌ చేసుకునే వెసులు బాటు ఉంటుంది.

భారత్‌లోనూ…
ఆర్కూట్‌ వివాదాలు భారత్‌లోనూ ఉన్నాయి. 2006లో బొంబాయి హైకోర్టు ఔరంగాబాద్‌ డివి జనల్‌ బెంచ్‌ గూగుల్‌కు నోటీసు జరీచేసింది. గూగుల్‌కు అనుబంధంగా ఉన్న ఆర్కూట్‌లో ‘వు య్‌ హేట్‌ ఇండియా’ పేరుతో కొందరు ఆకతా యిలు ఓ కమ్యూనిటీ సృష్టించారు. భారత జాతీ య జెండాను కాల్చుతున్న కొన్ని చిత్రాలతో పా టు భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని నినాదాలు ఆ ర్కూట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీనిని చూసి ఆగ్ర హించిన ఔరంగాబాద్‌కు చెందిన ఒక అడ్వకేట్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఫైల్‌ చేశాడు. బొం బాయి హైకోర్టు గూగుల్‌కు నోటీసు జారీచేసింది. దీంతో ఆర్కూట్‌ దిగివచ్చి ఆ సమాచారం ఉన్న మ్యూనిటీని తొలగించడంతో వివాదం సద్దుమ ణిగింది.

buyukkoten-girlడబ్బులే… డబ్బులు…
(గూగుల్‌కు ఈ సైట్‌ను అమ్మడం ద్వారా చేసుకున్న ఒప్పందం ప్రకారం…)
* http://www.orkut.com వ్యవస్థాపకుడు ఆ ర్కూట్‌ బుయుక్కొటెన్‌ ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా గుర్తింపు.
* ప్రపంచం ఏమూల నుంచైనా కొత్త నెటిజన్‌ ఠీwww.orkut.com రిజిష్టర్‌ చేసుకుంటే ఆ ర్కూట్‌ బుయుక్కొటెన్‌కు గూగుల్‌ సంస్థ 12 డా లర్లు (ప్రస్తుతం మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 575) చెల్లిస్తుంది.
* ఆర్కూట్‌ సభ్యుడు కొత్తగా ఎవరైనా స్నేహితుడ్ని ఈ పోర్టల్‌కు పరిచయం చేస్తే ఆర్కూట్‌ బు యుక్కొటెన్‌ ఎకౌంట్‌లో 10 డాలర్లు వచ్చి చేరుతాయి.స్నేహితుడి స్నేహితుడు ఆర్కుట్‌కు కొత్తవారిని ప రిచయం చేస్తే 8 డాలర్లు, ఆ కొత్త స్నేహితుడు మ రో స్నేహితుడ్ని పరిచయం చేస్తే 6 డాలర్లు ఆర్కూ ట్‌ బుయుక్కొటెన్‌కు అందుతాయి.
నెట్‌వర్క్‌ సభ్యుకు ఇతరులు (బయటి వారు కూడా కావచ్చు) పలకరించిన ప్రతీసారీ 4 డాలర్లు, ఎవరైనా ఆర్కూట్‌ సభ్యుడు నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యుల్ని పలకరించిన ప్రతీసారీ 5 డాలర్లు ఆర్కూట్‌ బె్యైక్కొటెన్‌కు చేరుతాయి.
* http://www.orkut.comలో చేరిన సభ్యులు ఫో టోల్ని డౌన్‌లోడ్‌ చేసిన ప్రతీసారి ఆర్కూట్‌ బు యుక్కొటెన్‌కు గూగుల్‌ వారు అదనంగా 200 డాలర్లు చెల్లిస్తారు.
* Orkut సభ్యుడెవరైనా సెట్‌లోకెళ్లి మరో స భ్యుడ్ని క్రష్‌ లిస్ట్‌ లేదా హాట్‌ లిస్ట్‌లో చేర్చితే ఆ ర్కూట్‌కు 2.5 డాలర్లు అందుతాయి.
* Orkut పోర్టల్ సభ్యుడైవరైనా మరో సభ్యుడికి ఫ్యాన్‌గా మారిన వెంటనే ఆర్కూట్‌కు రెండు డాలర్లు ముడతాయి.ఎవరైనా మీకు (ఆర్కూట్‌ మెంబర్‌కు) ఫ్యాన్‌గా మారితే 1.5 డాలర్లు ఆర్కూట్‌కు వచ్చి చేరుతాయి.
* Orkut పోర్టల్‌ నుండి మెంబర్‌ లాగ్‌ఔట్‌ అయిన ప్రతీసారీ ఆర్కూట్‌కు అదనంగా ఒక్క డాలర్‌ అందుతుంది.
* ఎవరైనా Orkut మెంబర్‌ వ్యక్తిగత అకౌం ట్‌లో తన ఫోటోను మార్చిన ప్రతిసారీ 0.5 డాల ర్లు ఆర్కూట్‌ అకౌట్‌లో పడిపోతాయి.
* Orkutకు లాగిన్‌ అయిన ప్రతీసారీ 0.5 డాలర్లు, ఇన్‌బాక్స్‌లో వారికి వచ్చిన మెయిల్స్‌ను చదివినప్పుడల్లా మరో 0.5 డాలర్లు ఆర్కూట్‌ ఖ జానాకు వచ్చి చేరుతాయి.
* Orkutనెట్‌వర్క్‌ను ప్రతిరోజూ సందర్శించే వారి సంఖ్యా పరంగా చూస్తే బ్రెజిల్‌ దేశం (51 శాతం)ప్రథమస్థానంలో, భారత్‌ (17శాతం) రెండో స్థానంలో నిలుస్తుంది.

పూర్తి పేరు : ఆర్కుట్‌ బుయుక్కొటెన్‌
పుట్టిన తేదీ : ఫిబ్రవరి 6, 1975 (35 సంవత్సరాలు)
జన్మస్థలం : కొన్యా (టర్కీ)
విద్యార్హతలు : బిల్కెన్ట్‌ యూనివర్సిటీ (అంకారా) నుంచి బియస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)
ఇదే విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌ (ఐటీ-ఆర్కిటెక్ట్‌)
పిహెచ్‌డీ (కంప్యూటర్‌ సైన్స్‌) స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ
తొలి ఉద్యోగం: 2002లో గూగుల్‌లో చిరుద్యోగం
గుర్తింపు : జనవరి 2004లో ప్రారంభించిన http://www.orkut.com అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందడం.

-నండూరి రవిశంకర్‌,
సండే డెస్క్‌ ప్రతినిధి

ప్రకటనలు

5 Comments

  1. >> “ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ కావడం వలన …. ”

    ఇది సరి కాదు. ఆ స్థానం ఫేస్‌బుక్‌ది. భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో మాత్రం మొదటి స్థానం అర్కుట్‌దే. Arkut’s light weight design is the primary reason why it’s hugely successful in countries with slow network speeds.

  2. ఆర్కూట్ కి నేను జన్మజన్మలకి ఋణపడి ఉంటాను. దానివల్లే నా చిన్ననాటి స్నేహితులందరు కలిసారు. అనుకోని అద్భుతంలా ఆర్కూట్ నా జీవితంలోకి వచ్చింది. కొత్త వెలుగులు నింపింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s