ఇలాంటివి మాకెక్కవు లెండి…


సూర్య పేపర్ విహారిలో ఈ వ్యాసాన్ని చూశా..సగం చదివాక జుట్టు పీక్కుని..బొజ్జున్నా..ఎందుకో పై హెడ్డింగు చూస్తే తెలిసింది కదా..చదవండి.[.వ్యాస రచయితలకు కృతఘ్యతలతో…}
ఇక్కడ నిబంధనలు అతిక్రమించరు

perfect‘నిరుపప్లవ’… అంటే లలిత సహస్రనామాల్లో ఒక నామం. దాని అర్థం – తాను నియమించిన నిబంధనలు తాను కూడా పాటిస్తుందని. అలా అమెరికా వాళ్ళు నియమ నిబంధనలు పెట్టడమే కాదు వాళ్ళు కూడా పాటిస్తారు. ఒక పొలిట ికల్‌ లీడర్‌ అయినా ఒక ఇండస్ట్రియలిస్ట్‌ అయినా ఆ నిబంధనలను అ తిక్రమిం చాలనుకోరు. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు, పేదల నుండి ధనికుల వరకు అం దరూ… ఎవరూ చెప్పక్కర్లేకుండానే వాళ్ళంతట వారే రూల్స్‌ పాటిస్తా రు. అక్కడ… ఎవరూ చూడటం లేదుకదా అని రూల్స్‌ అతిక్రమించరు. స్కూళ్ళల్లో పిల్లలకు చదువుకంటే ముందు రూల్స్‌ గురించి చెబుతారు, నీతి, నిజాయితీల గురించి చెబుతారు. చదువు రాకపోయినా ఫరవాలేదు. నిజాయితీగా ఉండాలని నేర్పుతా రు. ఇక్కడ చదువుకునే పిల్లలు అలా రూల్స్‌ను పాటిస్తూ నిజాయి తీగా ఉంటారు. ప్రతి ఒక్కరు దేశానికి ఏం చేస్తున్నానన్నట్లుగా ఉంటారు.

ఇక్కడున్న వాళ్ళందరికీ దేశ భద్రత గురించి బాధ్యత ఉన్నదన్నట్లుగా భావిస్తా రు. ప్రతి పౌరుడు ఆ బాధ్యతలో పాలుపంచుకుంటారు. ఎవరైనా రూల్స్‌ను అ తిక్రమించినట్లు తెలిస్తే పక్కవాళ్ళు ఊరుకోరు. వెంటనే కంప్లైంట్‌ చేస్తారు. వీళ్ళలో మరో మంచి గుణం, అందరి దగ్గర మంచిని తీసుకుంటారు. పాత పద్ధతులు కష్ట మైనా వాటినే పాటిస్తూ కష్టపడరు. ఏ పనైనా సుఖంగా ఉంటే వాటిని ఆహ్వానిస్తారు. ప్రతి పనిలోనూ పరిశోధించి మార్పులు తీసుకురావడానికి చూస్తారు. భూ వనరులను వీరు పరిశోధించి వినియోగంలోకి తేవడానికి చాలా ఖర్చుపెడతారు. ప్రభుత్వం కూడా వారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందజేస్తుంది. చెత్తని కూడా వినియోగంలోకి తేవడానికి రీసైక్లింగ్‌ చేస్తారు.

చెక్కతో ఇళ్ళు కడతారు. చెట్ల బాగా పెంచుతారు. ఒక కాలనీకి, కాలనీకి మధ్య చాలా దూరం చెట్లు వేస్తారు. మొత్తం ఖాళీ స్థలం అంతా లాన్లు, చెట్ల పెంచుతారు. ఇళ్ళు మూడు టైపుల్లా ఉంటాయి. గార్డెన్‌ హౌజ్‌, కండొమినియమ్స్‌, ఇండి పెండెం ట్‌ హౌజ్‌ ఉంటాయి. మెయింటెనెన్స్‌ ఫీజులు నెలనెలా కట్టాలి. రోడ్డు, చెట్లు, లాన్‌ కటింగ్‌, నీళ్ళు పోయడం లాంటి పనులు అసోషియేషన్‌ వాళ్ళే చేస్తా రు. ఎక్కడా మట్టి కనిపించకుండా చెక్క పొట్టును పోస్తారు. దాని వలన మట్టి పైకి లేవదు. చెట్లను చక్కగా కటింగ్‌ చేస్తారు. చూట్టానికి ప్రతి కాలనీ గార్డెన్‌ లాగా ఉంటాయి. బట్టలు బయట ఆరవేయకూడదు. కాలనీ అసోసియేషన్‌ వాళ్ళు రూల్స్‌ లిస్ట్‌ ఇస్తా రు. దీనిని ఎవరూ అతిక్రమించరాదు. చెట్ల దగ్గర నుంచి చెట్ల పెంపకం వరకు చాలా రూల్స్‌ ఉంటాయి. పిల్లలకు స్కూల్స్‌ బాగుంటాయి. కిండర్‌ గార్టెన్‌ నుంచి హైస్కూల్‌ వరకు మంచి చదువు చెబుతారు. ఫీజులుండవు. అది ప్రభుత్వం భరి స్తుంది. ఇది తప్ప ఇక్కడ అంతా ప్రైవేట్‌ కంపెనీలే నిర్వహిస్తాయి. ప్రతిదీ బిజినెస్‌ చేస్తారు. చెత్తను కూడా బిజినెస్‌ చేస్తారు.

rulesవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చెత్తను దానిని రీసైక్లింగ్‌ చేస్తారు. ఈ కంపెనీ ఇక్కడ లాభాల్లో ఉన్న టాప్‌ 100 కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రతి పౌరునికి ఉద్యోగం కోసం వచ్చే హెచ్‌1 వీసా వాళ్ళకి ఒక సోష ల్‌ సెక్యూరిటీ నెంబర్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌) ఇవ్వబ డుతుంది. ఇది చూపించి కారు లైసెన్సు, ఇల్లు రెంటల్‌ డీడ్‌ కి, క్రెడిట్‌ కార్డ్స్‌కి, బ్యాంక్‌ ఖాతాకి, మొత్తం ఇక్కడ నివసించ డానికి ఆ నెంబర్‌ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుం ది. ఇక్కడ రూల్స్‌ ఫాలో అవ్వకపోతే, ఆ నెంబర్‌లో రిమార్క్స్‌ నోట్‌ అయిపోతాయి. ఆ నెంబర్‌ మొత్తం దేశం లో రిజిస్టర్‌ అయిపోతుంది. ఆ నెంబర్‌ లేకుండా ఇక్కడ నివసించడం చాలా కష్టం. అందులోని రిమార్క్స్‌ను బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడనేది అర్థం అవుతుంది. దీనిని బట్టి గ్రేడ్‌లు కూడా ఉంటాయి. ఇక్కడ గ్రీన్‌ కార్డ్‌ రావడానికి అది పనికొస్తుంది.
ఇక్కడ సివిల్‌ కేసులు తీర్పు చెప్పేటప్పుడు, ఇక్కడ పౌర హక్కు కలిగిన ప్రతి పౌ రుడూ అర్హుడే. ఆయా ప్రాంతాల్లో ఉన్న పౌరుల్ని జీతంతో కూడిన సెలవులిచ్చి తీర్పు చెప్పడానికి తీసుకెళ్తారు. ఏ కేసుకు ఎరిని తీసుకెళ్తారన్నది రహస్యంగా ఉంచుతారు.

వీళ్ళు అన్ని దేశాలతో బిజినెస్‌ చేస్తారు. వేరే దేశాలు ఇక్కడ బిజినెస్‌ చేసుకోవడా నికి అనుమతిస్తారు. అన్ని దేశాల వారి రెస్టారెంట్లు షాపులు ఉన్నాయిక్కడ. డబ్బు జనం చేతుల్లో ఉండకూడదు. అది ఎప్పుడూ సర్క్యులేట్‌ అవ్వాలన్నది వాళ్ళ పాలసీ. రిక్రియేషన్స్‌ చాలా ఉంటాయి. దేనిలో ఇష్టం ఉన్నవాళ్ళు దానికి వెళ్ళవచ్చు. ఆటలు, క్లబ్బులు, కాసినో అని జూదం ఆడటా నికి, టూరిస్టు ప్రదేశాలు, పెద్ద పెద్ద మాల్స్‌, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా చూపించడానికి టూరిస్టులను నియమిస్తారు. ఇలా జనం కాలక్షేపం చేయడానికి చాలా ఉంటాయి. ఇంట్లో సుఖవంతంగా ఉం డటానికి, వాడటానికి వస్తువులు చాలా ఉంటాయి. వాటిని అమ్మేం దుకు ప్రతి ఊళ్ళో పెద్ద పెద్ద మాల్స్‌ ఉంటాయి. ఎంత దూరమైనా కారుల్లో వెళ్తుంటారు. ప్రతిదానికి ఇన్షూరెన్స్‌ పాలసీలు ఉంటాయి. మెడికల్‌ ఇన్షూరెన్స్‌ తప్పనిసరి. ఇన్షూ రెన్స్‌ కార్డు లేనిదే డాక్టర్లు కూడా చూడరు. ప్రతీది డాక్టర్లు రోగికి చెప్పి చేస్తారు. మందులు కూడా ఎందుకిస్తున్నారో, ఎలా పనిచేస్తాయో చెబుతారు.

ప్రతి పని ఇంటలీజెంట్‌తో చేస్తారే గాని, ఎవరికి వాళ్ళు చేసేది కాదు. ఎంత ఎక్స్‌ట్రీమ్‌ టెంపరేచర్‌లో కూడా వారు అన్ని పనులు చేసుకోగలుగుతారు. జన వరి వచ్చిందంటే కొన్ని స్టేట్లలో టెంపరేచర్‌ ఉంటుంది. అదే వేసవి కాలం జులై, ఆగస్ట్‌ 15 వరకు ఉంటుంది. స్కూల్స్‌కి సెలవులు కూడా జులై, ఆగస్ట్‌లోనే ఉంటాయి. ఆ సమయంలో పగలు సూర్యుడు ఆరు గంటలకే ఉదయించి సాయంత్రం ఎనిమిదిన్నరకి అస్తమిస్తాడు. రాత్రి తొమ్మిదిన్నరకి చీకటి పడదు. ఈ సమయంలో చూడాలి ఇక్కడి అందాలు. సెప్టెంబర్‌లో నార్త్‌ ఈస్ట్‌ ప్రాంతాలలో చెట్ల ఆకులు రాలటం మొదలవుతాయి. ఆకులు రాలే టైంలో చెట్ల అందాలు చూసి తీరాల్సిందే. కొన్ని చోట్ల ప్రత్యేకంగా అడవుల్లో రోప్‌ వేల సహాయంతో తీసుకెళ్ళి చూపిస్తారు. ఇక్కడ కొన్ని ఊళ్ళల్లో పొలాల్లో పండే కూరగాయల్ని మనంతట మనం కొనుక్కునేలా ఏర్పాటు చేస్తారు. అవి ఏఏ రోజుల్లో ఉంటాయో వెబ్‌సైట్లలో పెడతారు. ఆ రోజుల్లో వెళ్తే పొలాల్లోకి వెళ్తే తిన్నంత తిని ఇంటికి కూడా తె చ్చుకోవచ్చు. ఇంటికి పట్టుకెళ్ళే వాటికే ధర తీసుకుంటారు. వీటినే పికింగ్‌ అంటారు. చాలామంది వస్తారు. అది ఒక అనుభూతి.

ఎంత దూరమైనా కార్లలోనే వెళ్తుంటారు. రోడ్లు చాలా బాగుంటాయి. రోడ్డు రూల్స్‌ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అక్కడక్కడ పోలీసులుం టారు. వాళ్ళ చేతుల్లో కెమెరాలుంటాయి. ఏ చిన్న పొరపా టు లేదా యాక్సిడెంట్‌ జరిగినా పోలీసులొచ్చి సహాయం చేస్తారు లేదా మన తప్పయితే యాక్షన్‌ తీసుకుంటారు. హైవేల్లో కాఫీ హౌజ్‌ ఉంటాయి. కార్ల లోనే ఆర్డర్‌ చేసి కార్లలోనే పికప్‌ చేసుకునేటట్లుంటాయి.
వీళ్ళకు కూడా మూఢ నమ్మకాలుంటాయి. ‘హాలోవీన్‌’ పండుగ అక్టోబర్‌లో వస్తుంది. దీనికి నెలరోజుల ముందుగా ఇంటి ముందు

గుమ్మడికాయలు, దె య్యాల బొమ్మలు పెడతారు. ఈ పండుగ రోజున పిల్లలు అందరూ అందరిల్లకు వెళ్ళి చాక్లెట్‌లు అడుగుతారు. వింతవింత డ్రెస్‌లు వేసుకుంటారు. పెళ్ళిళ్ళకు కూడా గుమ్మడికాయలు గుమ్మం ముందు పెడతారు. పిల్లల పెంపకంలో వీళ్ళు చాలా శ్రద్ధ వహిస్తారు. కడుపులో ఉండగానే పిల్లలని ఎలా పెంచాలో ట్రైనింగ్‌ ఇస్తారు. డాక్టర్లు పిల్లల పెంపకం గురించి పుస్తకాలిస్తారు. పెంపకంలో తండ్రి పాత్ర కూడా చాలా ఉంటుంది. తండ్రికి కూడా ట్రైనింగ్‌ ఇస్తారు.

దేనిలోనైనా, ఏ జాతిలోనైనా మంచిని తీసుకోవటం, చెడును విడిచిపెట్టడం అన్నది వీళ్ళ నుండే అందరూ నేర్చుకోవాలి. చార్వాక సిద్ధాంతాలన్నీ వీళ్ళు పాటి స్తున్నారినిపిస్తుంది. జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి నీతి, నిజాయితి కా వాలన్నది వీరి విశ్వాసం. దీనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అది అందరికీ ఆద ర్శం కావాలి. ధర్మోరక్షతిః రక్షితః అనడం కాదు చేయడం ప్రధానం

ప్రకటనలు

4 Comments

  1. మొదటి నుంచి అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. అయినా కొన్ని విషయాలలో అమెరికాకి అలా నప్పుతుంది. మనకిలా నప్పుతుంది. మన దగ్గరుండే ఆదరణ, ఆప్యాయత అక్కడుండదు కదా. నా దృష్టిలో అమెరికాలో కంటే ఇండియాలోనే ఎక్కువ స్వేచ్ఛగా జీవించవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s