దోమల పురాణం


దోమలతో చస్తూన్నాం గా ఏదో ఒకటి చేద్దాం..
దోమల్లేని పరిసరాల కోసం

Mosquitoరాష్ట్రం దోమల జబ్బులతో వణికిపోతుంది. మన్యంలో మలేరియా ఎక్కువగా ఉంది. కరీంనగర్‌లో డెంగీ జ్వరం ఎక్కువగా ఉంది. అక్కడక్కడా చికెన్‌గున్యా ఉంది. దోమల జబ్బుల తో జనం చచ్చిపోతున్నారు. వైద్యానికి ఖర్చుపెట్టే డబ్బుతో దివాలా తీస్తున్నారు. మన ప్రాంతంలో దోమలవల్ల మలేరియా, మెదడువాపు, డెంగీజ్వరం ప్రాణాలు తీసే దోమజబ్బులు. దోమలతో ఎ ల్లో ఫీవర్‌ మరియు వెస్ట్‌నైల్‌ ఫీవర్‌ అనే జబ్బులు కూడా రావచ్చు.

దోమలతో వచ్చే జబ్బులకు దోమలనివారణీ సరియైన రక్ష. ఇందులో మన వ్యవస్థ పూర్తిగా విఫలమైనది అనుటలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు పాల్గొనని ఏ ఆరోగ్య కార్యక్రమం విజయవంతం కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చె పుతోంది. వ్యవస్థాపరంగా జరుగుతున్న అన్ని చర్యలతో పాటు ప్రజలందరూ దోమల నివారణ కు కొన్ని స్వయం నియంత్రణ చర్యలు చేపట్టాల ని ఓపియస్‌డీఎచ్‌ ఆకాంక్షిస్తుంది. ఇందులో భా గంగా ప్రజలు ఈ దోమల నివారణ చర్యలు చేపట్టాలి.

 • గృహాల పరిసరాలలో ఉండే నీటి గంటలు ప్రజ లు సమిష్ఠిగా పూడ్చుకోవాలి.
 • గృహాల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా, మరుగునీటి కాలువల్లో చెత్తా చెదారం చేరకుండా చూసుకోవాలి. ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
 • నీరు నిల్వ ఉండిన ప్రాంతాలలో, మరుగునీటి కాల్వలలో కిరోసిన్‌, ఇతరదోమ సంహారక మందులు చెల్లించాలి, చల్లాలి.
 • మలేరియా, మెదడువాపు, డెంగీజ్వరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు కాళ్ళూ, చేతు లూ పూర్తిగా కప్పుకోవాలి.
 • సాయంత్రం 6గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గృహాలలో తలుపులు మూసి వేయాలి. ఆ సమయంలో దోమలు ఎక్కువగా బయట నుండి ఇంటిలోనికి వస్తాయి.
 • వీలైనవారు కిటికీలకు, తలుపులకు దోమలు రాకుండా మెష్‌ అవర్చుకోవాలి.
 • గృహాలలో లెట్రిన్స్‌, స్నానపు గదుల నుండి నీ రు బయటకు పోయే సిమెంటు లేదా ప్లాస్టిక్‌ గొ ట్టాల చివర మెష్‌ బిగించు కుంటే బయట నుండి గృహాలలోకి దోమలు రావు.
 • మలేరియాను అరికట్టడానికి దోమల నివారణ లో భాగం గా ఆరోగ్యశాఖ సిబ్బంది క్రిమిసంహార క మందులు గృహాలలో చల్లుతారు. వారికి ప్రజ లు సహకరించాలి. గృహాలలోని ప్రతిగదిలోనూ చల్లించాలి. మందు చల్లిన తర్వాత గోడలకు సు న్నము వేయరాదు. గోడలపై పటములు, క్యాలెం డర్లు మందుచల్లే ముందు తీసేయాలి.
 • దోమల నివారణ మందులు పొ గ ద్వారా వదులు తుంటారు. దీని ని ఫాగింగ్‌ అంటారు ఈ కార్యక్ర మం జరుగుతున్నప్పుడు గృహాలలో కిటికీలు, తలుపులు తెరచిఉంచాలి.
 • డెంగీజ్వరం, చికెన్‌గున్యా కలిగిం చే ఈడిస్‌ ఈజిప్టి దోమ సాధారణంగా ఎక్కువగా నీరు నిల్వ ఉండే వస్తువులయిన ఎయిర్‌కాలర్స్‌, పూల కుండీలు, సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు, నీరు నిలువ చేసిన తోట్లు, కుండీలు, ఫేంటెన్స్‌ ఖాళీ డ్రమ్ములు, సన్‌షేడ్స్‌ పై నిలిచిన నీరు, బిల్డింగ్‌లపై నిల్చిన నీరు, బిల్డింగ్‌ల పై నిల్చిన నీటిలో పెరుగుతోంది. కనీసం వారానికి ఒక రోజు వీటిలో నీరు తొలగిస్తూ డ్రైడే పాటించాలి.
 • దోమల నివారణలో దోమ తెరల వాడకం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. కొన్ని దేశాలలో మ రియు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో క్రిమి సంహారక మందులతో మిలితము చేసిన దోమ తెరలు వాడుచున్నారు. వీటిని ఉతుక్కోవచ్చు. 6 నెలల కొకసారి క్రిమిసంహారక మందు మిలిత ము చేయాలి. ఇందువల్ల మలేరియా వ్యాధులు 50 శాతం, మలేరియతో మరణాలు 20 శాతం తగ్గినట్లు వైద్య నివేదికలు తెలుపుచున్నవి.
 • మనం సాధారణంగా వాడే నూలు, నైలాన్‌ దోమతెరలు కూడా చాలా మంచి రక్షణనిస్తాయి. దోమ ల వల్ల వచ్చే జబ్బులు, దోమతెరల వలన లాభిం చే ఫలితాలను చేరీజు వేసుకుంటే మనం దోమతెరలపై పెట్టే డబ్బు ఏమంత ఆలోచించవలసిన ఆర్ధిక అంశం కాదు.

– డా ఆరవీటి రామయోగయ్య

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s