ఆంధ్రా ఊటీ అరకు ..మిస్ అవ్వకండీ..


అంటున్నారు..surya daily  13/04/2010 నుండి…

అరవిరిసిన అందానికి అరకు చిరునామా…
borra-cavesపేదల ఊటీగా పేరొందిన అందాల అరకులోయ ప్రకృతి పిపాసకులకు ఊహాలోకంగా, ప్రకృతి ఆరాధకులకు స్వర్గధామంగా పేరెన్నికగన్నది. అడుగడుగునా పర్యాటకుల కళ్లను కట్టిపడేసే ప్రకృతి అందాలను తనలో నిబిడీకృతం చేసుకుని, తూరుపు కనుమల్లో ఒదిగి ఉన్న మన్యం అందాలు వర్ణించాలంటే రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ తిరిగి కలం పట్టాల్సిందే. వసంత కాలంలో గిరిజన గూడాల్లో వినిపించే పల్లె పదాలు, జనవరి మాసంలో గిరిజన తండాల నడుమ వెలిగించే నెగళ్ల వెలుగులో గిరిజన యువతులు చేసే ధింసా నృత్యాలను కని ఆనందించాలంటే అది సులభసాధ్యం కాదు. నిత్యం రణగొణ ధ్వనుల నడుమ జీవించే నాగరిక ప్రపంచానికి 100 కిలోమీటర్లలో ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందంటే అతిశయోక్తి
అనిపించకమానదు.

araku-viesమన్నెం వాతావరణాన్ని, దాగి ఉన్న ప్రకృతి సోయగాలను తిలకించడానికి దేశవిదేశీ పర్యాటకులు తండోప తండాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యానికి తరలి రావడం ఎప్పటినుండో పరిపాటిగా మారింది. బెంగాల్‌ నుండి పర్యాటకులు జనవరి మాసంలో క్రమం తప్పకుండా ఇక్కడకు వచ్చి కనీసం వారం రోజులు హాయిగా సేదతీరి, ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించి వెళ్లడానికి ఇచ్చే ప్రాధాన్యతను తలచుకుని ఇక్కడ జీవించే వారు ఆశ్చర్యపోతుంటే, ఇక్కడ జీవించలేకపోతున్నామనే భావనతో బరువెక్కిన హృదయాలను ఓదార్చుకుంటూ వెళ్లే పర్యాట ుల మనోభావాలను ఏవిధంగా అన్వయించాలో కవిపుంగవులకే సాధ్యం. సముద్ర మట్టానికి 3వేల 500 అడుగుల ఎత్తులో విభిన్న వాతా వరణం నడుమ ఉన్న విశాఖ మన్యంలో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన సిమిలిగుడ రైల్వేస్టేషన్‌ ఉంది. అలాగే నీరు ఘనీభవించి వింత ఆకృతులకు ఆలవాలమైన బొర్రా గు హలు ఈ ప్రాం తంలోనే వున్నాయి.

araku-train-viewఅరకు లోయ అంటే బొర్రా గుహలే అనే విధంగా ప్రఖ్యాతిగాంచిన తరుణంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో అరకులో గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం ఏర్పాటుచేసి అరకు లోయకు ప్రాధాన్యతను తీసుకువచ్చారు. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన కటిక జల పాతం, చాపరాయి జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అరకులోయ వచ్చారంటే ఒకరోజు కాదు రెండు రోజులు పర్యాటకులు వింత అనుభూతులను మూటగట్టుకుని వెళతారని ఘంటాపథంగా చెప్పవచ్చు. దీనికి తోడు పర్యాటక శాఖ పరంగా పర్యాటకుల సౌకర్యార్ధం దిద్దిన మెరుగులు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసేవే.
విశాఖనుంచి అరకులోయ చేరుకోవడానికి రైలు మార్గం గుండా వస్తే కలిగే అనుభూతి ఎన్నటికి మరువలేనిది. కొండలను తొలిచి, లోయల మీదుగా నిర్మించిన రైలు మార్గం ద్వారా ప్రయాణించడం ఒక మరపురాని అనుభూతి.

chaparaiప్రమాద భరితమైన ఈ మార్గంలో అనేకమార్లు ఎతె్తైన కొండలనుండి జారిపడిన బండరాళ్లు అప్పుడప్పుడు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించాయే తప్ప ఎప్పుడూ ప్రయాణికులకు హాని చేయలేదు. నిత్యం సుమ బాలలతో విరాజిల్లే పద్మాపురం గార్డెన్‌ నేడు వన్నె తగ్గినా పర్యాటకుల సౌకర్యార్ధం ఇటు ఐ.టి. డి.ఎ.తో పాటు అటు పర్యాటకశాఖ అరకులోయ అందాలను ఇనుమడింపజేయడానిి, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఎంతో శ్రద్ధ తీసు కుంటోంది. వేల రూపాయలు ఖర్చు చేసినా దొరకని ప్రశాంతత, ఆహ్లాదం విశాఖమన్యం సొంతమని పర్యాటకులు పేర్కొనడమే కాకుండా మరుసటేడు కూడా ఇక్కడికి రావాలనే బలీయమైన కోరికను వారు ఎన్నటికి విడనాడలేమని చెబుతుంటారు.

tribal-museumపర్యాటకపరంగా మరింత అభివృద్ధి అవసరం…
విశాఖ మన్యానికి వచ్చి సేదతీరడం పర్యాటకులకు పరిపాటిగా మారిన నేపథ్యంలో మన్యాన్ని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేయాల్సి వుంది. కాగా పర్యాటక రంగం చాలా విషయాల్లో చతికిల పడిందనేది వాస్తవం. విశాఖనుండి అరకులోయ మీదుగా పెద బయలు, హుకుంపేట, పాడేరు మండలాలను కలుపుకుని పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేయాలని తలచినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పెదబయలు మండలంలోని జడిగూడ జలపాతం, హుకుంపేట మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మత్స్యగుడం అభివృద్ధికి పర్యాటక పరంగా తీసుకున్న చర్యలు ఒక విధంగా విఫలం కావడంతో అటు పర్యాటక శాఖతోపాటు, ఇటు ఐ.టి.డి.ఎ. కూడా చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

araku-water-fallsసంప్రదాయ వంటలు రుచిచూడవలసిందే…
పాడేరు మండలంలోని పలు ప్రాంతాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఇప్ప టికీ కార్యరూపం దాల్చలేదు. సుందర ప్రకృతి నడుమ గడిపి వెళ్లాలనే పర్యాటకుల కలలను నిజం చేయడానికి ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ప్రతిపాదించిన కాఫీతోటల నడుమ ట్రీహట్స్‌, ట్రెక్కింగ్‌తో పాటు పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధిలోని పారులొడ్డు జలపాతం వద్ద ఒకరోజు గడిపి, గిరిజన సంప్రదాయ ఆహారం ఆస్వాదించి నివశించడానికి అవసరమైన ఏర్పాట్లకు ప్రతిపాదనలు అక్కడే నిలచిపోయాయి.

విశాఖ మన్యంలో ఎటుచూసినా ప్రకృతి రమణీయత కళ్లకు కట్టిపడేసే విధంగా ఉన్నా దాన్ని సద్వినియోగం చేయడంలేదనే భావనను ప్రకృతి పిపాసకులు ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అంతే కాకుండా ఇక్కడ నివశించే అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి కల్ప నను కూడా ప్రకటించిన పర్యాటక శాఖ ఎందుకు వెనకడుగు వేసిందనేది జంగందేవరకే తెలియాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ముందడుగు వేసి పర్యాటకపరంగా మన్యం ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రకృతి ఆరాధకులు కోరుతున్నారు.

araku-dance

–   ముత్యాల మోహన్‌రావు,
మేజర్‌న్యూస్‌, పాడేరు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s