మెడికల్ కాలేజీ పెడధామ్..డబ్బు నొల్లుకుందామ్…రా…


ఇంకేమీ వ్యాపారాల్లేవా?medical college లు పెట్టి సంపాదించాలన్నమాట..దొంగ పేషెంట్ లతోనూ వేరే కాలేజీ సిబ్బందినీ  చూపించి liecence తెచ్చుకునీ.,వీళ్ళు ఎలాంటి డాక్టర్ లను మనమీదకు వదలబోతున్నారు? ఆంద్రజ్యోతి daily 11/04/10 నుండి..

ఉన్నదిలేనట్టు..లేనిది ఉన్నట్టు ..అంతా కనికట్టు

శ్రీకాకుళం, ఏప్రిల్ 10 (ఆన్ లైన్): మండలంలోని రాగోలులో ఉన్న 300 పడకల ఆసుపత్రిని కళాశా లగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం శనివారం ఎంసీఐ బృందం పర్యట నలో పడరాని పాట్లు పడింది.

అంతా తానై ఎండీ డాక్టర్ మధువిలేఖర్ దగ్గ రుండి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతా కనికట్టు చందంగా జెమ్స్ (గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూలు, ఆసుపత్రి) ఓపి విభాగాన్ని అద్దె రోగులను భారీ గా తరలించి ఎంసీఐ పరిశీలనకు మూ డు రోజుల ముందు నుంచి సమీప గ్రామాల్లో వుంచారు.

పలు విభాగా లకు సంబంధించి వైద్యసేవలకు రిమ్స్ వైద్యులను, కన్సల్టెంట్లను ముందస్తుగానే సిద్ధం చేశారు. ఎంసీఐ బృందం పర్యటనకు వివరాలు వెల్లడించేందుకు, ఫోటోలు తీసేందు కు సైతం యాజమాన్యం, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏయే అం శాలను ఎంసీఐ బృందాలు పరిశీలిం చింది, కళాశాలను ఏర్పాటు కావాల్సిన వనరులు, సిబ్బంది, వైద్యుల తదితర సమాచారమేది వెల్లడించలేదు.

ఎంసీ ఐ పర్యటన పరిశీలనపై ఎండీ డాక్టర్ మధువిలేఖర్ మాట్లాడుతూ శ్రీకాకు ళం లాంటి అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంలో వైద్య కళాశాల స్థాపించ డం ఒక పెద్ద సాహసమని, జిల్లాలో రెండో వైద్య కళాశాలతో మరింత మెరుగైన అభివృద్ధి జరుగుతుందనే కొంతమంది భాగస్వామ్యంతో కళాశా ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. విశాఖపట్నం, విజయ వాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వైద్య కళాశాల ఏర్పాటు చాలా సులు వన్నారు.

రాగోలులో జెమ్స్ వైద్య కళా శాలకు కావల్సిన మౌలిక వసతులు, ప్రొఫెసర్లు, వైద్యసిబ్బంది, ఫ్యాకల్టీ, స్టాఫ్ క్వార్టర్లు సిద్ధంగా ఉన్నాయని, వీటి పరిశీలనకు ఎంసీఐ బృందాన్ని ఆహ్వానించామన్నారు. ఎంసీఐ బృం దం సమగ్రంగా నివేదికలో వివరాలు నమోదు చేసుకొని సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు. త్వరలోనే జెమ్స్ కళా శాల ఏర్పాటుకు అనుమతి లభిస్తుం దన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
[ ఒకపక్క   కనీస వసతులు లేనివారికి కాలేజీ లు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తూనే ..ఇక్కడ గవర్నెర్ గారి హెచ్చరిక చూడండి…సూర్య పేపర్..11/04/10 నుండి.. ]

వైద్య వృత్తిని సాధారణ ఉద్యోగంలా చూడొద్దు
విజయవాడ : ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా లేని మెడికల్‌ కళాశాలకు నోటీసులు పంపించి, అవసరమైతే వాటి గుర్తింపు రద్దు చేయాలని గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం విజయవాడలోని దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తిని సాధారణ ఉద్యోగంలా చూడొదన్నారు. .
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s