వున్నది కాస్తా ఊడిందీ…


vizag ను  ఇష్టపడదానికి ఒక ముక్యకారణం అక్కడి వాతావరణం..అది ఒకప్పుడి మాట ..ఇప్పుడు అది కూడా దుమ్మూ.దూళీ, రణగొణుల గోలతో నిండిన నగరమే..

డేంజర్‌! కబళిస్తున్న కాలుష్యం

విశాఖపట్నం, సూర్యప్రతినిధి: ప్రకృతి వరమైన పంచభూతాలే విశాఖకు శాపంగా పరిణమిస్తున్నాయి. సహజసిద్ధమైన నీరు, గాలి కలుషితమైపోతున్నాయి. భూగర్బ జలాలు సైతం ఇంకిపోతుండటతో జనం గొంతెండిపోతోంది. దీనికి తోడు కాలుష్యం తీవ్రమవడంతో పచ్చని కొండల మధ్య ఉన్న విశాఖ నగరానికి ముప్పు ముంచుకొస్తోంది. కేంద్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సైతం విశాఖను కాలుష్య పూరిత నగరంగా గుర్తించిందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుంతో అర్థరం చేసుకోచ్చు. పొల్యూషన్‌ ఇండెక్స్‌లో ఇప్పటికే 70ని క్రాస్‌ అవుతున్న నేపథ్యంలో విశాఖ నగరం ఏ దిశకు సాగుతుందో అన్న ఆందోళన నెలకొంటోంది. మూడు పక్కల కొండలు, ఒక పక్క సాగరంతో అందాల నగరంగా వాసికెక్కిన విశాఖలో ఏడాది పొడుగునా 60 నుంచి 85 శాతం ఉక్కపోత కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఏడాదికి తొమ్మిది నెలలు దక్షిణం నుంచి పశ్చిమానికి, ఉత్తరం నుంచి తూర్పుకు వీచే గాలులు మూడు నెలల కాలం మాత్రం ఇందుకు భిన్నంగా వీస్తాయి. ఈ నేపథ్యంలో నగరంలో గాలి కాలుష్యమై నగరవాసులను వ్యాధులు రూపంలో కమ్మేస్తోంది. జోరుగా సాగే నిర్మాణ పనులు, రోడ్ల నిర్మాణాలు, ఖనిజాల రవాణా, క్వారీ తవ్వకాలు కారణంగా గాలిలో దూళి చేరి శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి.

నివాస ప్రాంతాలలో 60 క్యూబిక్‌ మీటర్ల దూళి ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో 120 క్యూబిక్‌ మీటర్లు ఉండగా, మింది పరిసర ప్రాంతాలలో 105 నుంచి 141 వరకు, జ్ఞానాపురం ప్రాంతంలో 79 నుంచి 90 క్యూబిక్‌ మీటర్లలో కాలుష్యం నిండి ఉంటోందని అంచనా. ప్రధానంగా పోర్టు ప్రాంతంలో జరిగే కార్గో హ్యాండ్లింగ్‌ నగరవాసులకు శాపంగా పరిణమిస్తోంది. గాలిలో చేరుతున్న ఈ కాలుష్యం కారణంగా ప్రజలు ఆస్తమా, ఉదర, శ్వాస కోస వ్యాదుల బారిన పడుతున్నారు. పరిశ్రమల నుండి వెలువడే విష వాయువులు కారణంగా పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైంది. సుమారు 60 క్యూబిక్‌ మీటర్ల వరకు ఎస్‌ఓ2, ఎన్‌ఒఎక్స్‌ వంటి వాయువులు వెలువడుతుండడంతో గాలిలో సహజసిద్దంగా ఉండే వాయువులతో రసాయనిక మార్పులు చెంది కొత్త వాయువులు వెలువడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఈ అంశం పై ఇంత వరకు ఎటువంటి పరిశోధనలు చేపట్టకపోవడం గమనార్హం.

పరిశ్రమలకు వంద మీటర్ల లోపు ఎటువంటి లేఅవుట్లకు అనుమతులు ఇవ్వరాదన్న నిబంధనలు తుంగలోతొక్కి నివాస ప్రాంతానికి చేరువలోనే పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఓ పక్క కాలుష్యం పెచ్చుమీరుతున్నా ఎన్‌టిపిసికి ఎదురుగా ఇటీవల కాలంలో బోనీ విలేజ్‌ పేరిట కొత్త లేఅవుట్‌ రూపుదిద్దుకోవడం విశేషం. అటు అధికారులుగాని, రియల్టర్‌గాని బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటం గమనార్హం. సముద్రజలాలను సైతం ఈ కాలుష్యం పట్టి పీడిస్తోంది. నగరంలో పలు ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు సముద్ర జలాల్లో కలిసిపోతుండడంతో జలచరాలు మృతిచెందడమే కాకుండా చర్మవ్యాధులు ప్రబలుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్కేబీచ్‌ వద్ద, హనుమంతవాక వద్ద సముద్రజలాల్లోకి ఈ మురుగు నీరు కలుస్తుండటంతో వంద మిల్లీ లీటర్ల నీటిలో 30 శాతం క్రిములు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రిముల కారణంగా గొంతుకు సంభందించిన వ్యాధులు, చర్మవ్యాధులు, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భూగర్బ డ్రైనేజీ పనుల నిమిత్తం జీవీఎంసీ కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనడానికి సముద్ర జలాలే సాక్షిగా నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ధ్వని కాలుష్యం కూడా నగరాన్ని మోగిస్తోంది.ఈ ధ్వని కాలుష్యం కారణంగా వినికిడి లోపం, రక్తపోటు వంటివాటికి దారితీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. నగరంలో 75 డెసిబిల్స్‌ ను ధ్వని మించి పోతోందని అధికారిక లెక్కలు చెపుతున్నాయి.

18 డెసిబిల్స్‌కు మించి వినకూడని నేపథ్యంలో నగరంలో పగటి పూట 65 డెసిబిల్స్‌ రాత్రి పూట 60 డెసిబిల్స్‌ నమోదయినట్టు అధికారిక సమాచారం. సిరిపురం, ఆశీలమెట్ట, టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతాలలో 75 నుంచి 83 డెసిబిల్స్‌ వరకు నమోదవుతుండడం గమనార్హం. ఇన్ని రకాల కాలుష్యాలు నగరాన్ని పట్టి పీడిస్తున్నా చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపడుతున్నా, నామమాత్రంగానే ఉంటున్నాయి.స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పేరిట తరిగి పోతున్న వృక్ష సంపద కారణంగా పచ్చదనం కనుమరుగవుతోంది. ప్రకృతి రమణీయతతోపాటు, ప్రశాంతమైన నగరంగా వాసికెక్కిన విశాఖ నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతోంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s