నీరూ ఆరోగ్జం….ఏదో భోజనం చేశాక తాగడం కాదు..మంచి నీరు…ఒక ఔషధమ్ కూడా.. సూర్య పేపర్ 08/04/2010..నుండి..

మంచినీరు మంచి ఔషధం

డైటింగ్‌ చేసి సన్నజాజితీగల్లా కావాలని కలలు కనే అమ్మాయిలూ…. ఇది మీకో హెచ్చరిక! డైటింగ్‌ చేస్తే సన్నగా, నాజూగ్గా, అందంగా తయారవుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే డైటింగ్‌ మీ నోటి దుర్వాసనకు కారణం అయ్యేందుకు ఆస్కారం ఉంది సూమా! ముంబాయికి చెందిన డాక్టర్‌ న్యూటన్‌ ఠక్కర్‌ ఏమంటారంటే… జీర్ణప్రక్రియలో కీలక పాత్ర పోషించే సలైవా అదేనండీ….. లాలాజలం…. దాన్ని ఉత్పత్తి చేసేదేంటో తెలుసా? మనం తీసుకునే ఆహారమే! లాలాజలం సహజసిద్ధమైన మౌత్‌వాష్‌గా పనిచేస్తుంది. మరి మనం కావలసినంత ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటే లాలాజలం ఉత్పత్తి ఆగిపోతుంది.అది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. ఒక వేళ డైటింగ్‌ తప్పనిసరి అయితే కనీసం సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగమని డాక్టర్‌ ఠక్కర్‌ సూచన.
 • water ఉదయం లేవగానే తప్పకుండా ఒకగ్లాసు నీరు త్రాగడం ద్వారా జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలను ఎక్కువ మొత్తంలో ిడ్నీలు శుద్ధిచేస్తాయి.
 • అంతేకాదు లావుగా ఉన్నామని బాధపడేవారు ఎక్కువగా నీటిని తీసుకుంటే నీరు క్రొవ్వును కరిగిస్తుంది. 
 • చల్లని నీరు తీసుకుంటే ఇంకా మంచిది. 
 • చల్లని నీరు క్రొవ్వును ఎక్కువ మొత్తంలో కరిగిస్తుంది.
 • నీరు సరిగా త్రాగని వారు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారప దార్థాలను త్వరగా జీర్ణించుకోలేరు.
 • మన కిడ్నీలు వాటి పని అవి సక్రమంగా పని చేయాలన్నా నీరు ఎక్కువగా త్రాగడం అవసరం. కిడ్నీలు వాటి శక్త్యానుసారంగా పని చేయకపోయినట్లైతే మన శరీరంలో వ్యర్థ పదార్థాల నిల్వలు పెరిగి అవి క్రమంగా లివర్‌పై పేరుకు పోతాయి. దాంతో మన శరీరంలో క్రొవ్వు పేరుకు పోవడం,లావవడం జరుగుతాయి.
 • కొంతమంది కాళ్లు, చేతులకు, పాదాలకు నీరు వచ్చి ఉబ్బడం జరుగుతుంది. ఈ సమస్య కూడా ముఖ్యంగా నీటిని తక్కువ త్రాగడం వల్ల, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతుంది.దీన్ని అధిగ మించడానికి కూడా ఎక్కువ మొత్తంలో నీరు త్రాగడం ఒక మార్గం.
 • శరీరానికి అవసరం లేని ఉప్పును కరిగించి దాన్ని కిడ్నీల ద్వారా నీటి రూపంలో బయటికి పంపాలన్నా ఎక్కువ నీరు త్రాగడమే ఉత్తమం. అవసరం కూడా.
  waters
 • మామూలుగా కన్నా ఎక్కువ బరువున్నవారు ప్రతి పది కిలోలకు ఒక గ్లాసు ఎక్కువ నీరు త్రాగాలి. 
 • మన కండరాలను పటిష్టం చేయడంలో, చర్మం నిగారింపులో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. 
 • ప్రతి మనిషి రోజుకు సగటున 8-10 గ్లాసుల మంచినీరు త్రాగాలి. 
 • ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా కనీసం రోజుకు 2- 3 లీటర్లు నీటిని త్రాగించాలి. 
 • నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడం, తద్వారా ఆయుష్షు పెరగడం తథ్యం.
 • ఆయుష్షును పెంచేది కనుకే నీటిని అమృతం అన్నారేమో.
 • అందుకే మీరు డాక్టర్‌ సలహా ప్రకారం రోజూ ఎక్కువ నీటిని త్రాగడం అలవాటు చేసుకోండి.ఎక్కడైనా బయటిెళ్లేటప్పుడు ఒక బాటిల్‌లో నీరు తీసుకెళ్లడం మాత్రం మరువకండి.బయట లభించే నీటిని సాధ్యమైనంత వరకూ తీసుకోవడం తగ్గించండి. నీరు బాగా త్రాగితే మీ ఆరోగ్యం మరింత బాగుంటుందని గుర్తుంచుకొండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s