.ఆడవారూ..ఆస్తి హక్కులూ…రెండోపెళ్ళి పెళ్ళి చేస్కున్న స్త్రీ  మొదటి భర్త  ఆస్తి లో హక్కును కలిగి వుంటుందా అన్న సందేహం చాలా మంది వెలిబుచ్చుతూ వుంటారు…ఇదిగో …సుర్య డైలీ  08/04/10 నుండి…

రెండో పెళ్లి చేసుకున్నా.. భర్త ఆస్తిలో వాటా

manam-mana-laతన్మయ భర్త చనిపోవడంతో తన ఆఫీసులో పనిచేస్తున్న మరో అబ్బాయిని వివాహం చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది. పెళ్లైన కొద్ది నెలల్లోనే రెండో భర్త జబ్బుతో మంచాన పడ్డాడు. తన్మయ తన దగ్గరున్న డబ్బంతా వైద్యం చేయించడానికి ఖర్చుపెట్టింది. అదే సమయంలో తన్మయ మామగారు, మరిది, బావగారు (మొదటి భర్త తండ్రి, సోదరులు) ఆస్తి పంపకాల కోసం కోర్టులో కేసు వేశారు. తన్మయకు కూడా తన భర్తకొచ్చే వాటాలో భాగం కావాలని అడగాలని ఉన్నా తను మళ్లీ పెళ్లిచేసుకుంది కాబట్టి వాటా ఇవ్వరేమోనని ఆందోళనలో ఉండిపోయింది.

తన్మయే కాదు. చాలా మంది ఆడవాళ్లకు భర్త చనిపోతే అతని ఆస్తిలో తమకు వాటా ఉందో లేదోనని భావిస్తూ ఉంటారు. ఒకవేళ మళ్లీ పెళ్లి చేసుకుంటే అసలు వాటా రాదేమోనని మరీ ఆలోచిస్తారు. ఇటువంటి వారి కోసమే సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. భర్త చనిపోయిన తర్వాత భార్య మరో పెళ్లి చేసుకున్నా అతని కొచ్చే ఆస్తిలో ఆమెకు వాటా వస్తుందని తీర్పునిచ్చింది.

ఆస్తిలో ఆడవాళ్లకు వాటా అన్నది గతంలో ఉండేది కాదు. తర్వాత కాలంలో వచ్చిన చట్టాల సవరణల ద్వారా స్ర్తీకి కూడా మగవారితో పాటు సమానంగా వాటా కల్పించారు. భర్త నుండి విడిపోయి జీవిస్తున్న భార్యకు భరణం, ఒకవేళ భర్త చనిపోతే అతని కొచ్చే ఆస్తి ముందుగా భార్యకు, తర్వాత పిల్లలకు ఇవ్వడం సాధారణంగా జరుగుతున్నదే. అదే విధంగా ఇప్పటివరకూ వితంతువులు తన అత్తమామ ఆస్తిలో తన భర్తకొచ్చే వాటా కోరాలంటే హిందూ వారసత్త్వ చట్టం ప్రకారం కేసు పెట్టేవారు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన కొత్త జడ్జిమెంటు ప్రకారం హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం, 1856 కింద కేసు వేస్తే వితంతువులు మరో పెళ్లి చేసుకున్నా మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుంది.

కేసు వివరాలు
కేసు : చెరోటె సుగాతన్‌ వర్సస్‌ చెరోటె భారతి వగైరా….
జడ్జిమెంటు ఇచ్చిన కోర్టు : సుప్రీంకోర్టు
తేదీ : 15-2-2008
బెంచ్‌ : ఎస్‌బి సిన్హా , విఎస్‌ సిర్‌పుర్‌కర్‌

lawవివరాలు: చెరోటె భారతి సుకుమారన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి అతను చనిపోయాడు. తర్వాత ఆమె సుధాకరన్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతను కూ డా కొంతకాలానికి మరణించాడు. అప్పుడు భారతి తన మొదటి భర్త కొచ్చే ఆస్తి తనకు రావాలంటూ కోర్టులో కేసు పెట్టింది. అత్త, మామలకున్న ఆస్తిలో తన భర్త మూడవ వ్యక్తి కాబట్టి, ఆస్తిని మూడు భా గాలు చేసి ఒక భాగం తనకు ఇవ్వాలని కేసులో పే ర్కొంది. కానీ, చెరోటె సుగాతన్‌ (తన భర్త సోదరుడు) హిందు వితంతువుల పునర్వివాహ చట్టంలో సెక్షన్‌-2 ప్రకారం, మరో పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా రాదని వాదించాడు.

అప్పుడు కోర్టు భారతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు లో కూడా అదే తీర్పు వెలువడడంతో చివరకు సు ప్రీంకోర్టులో సుగాతన్‌ అప్పీలు దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు ఆ సెక్షన్‌-2 ప్రకారం భర్త చనిపోయి నా తల్లిదండ్రుల నుండి అతనికి వచ్చే ఆస్తిలో వాటా తప్పకుండా భార్య మరో పెళ్లి చేసుకున్నా ఇవ్వాలని తీర్మానించింది. తన్మయలాంటి వాళ్లు ఈ తీర్పుని దృష్టిలో పెట్టుకొని నిర్భయంగా తన మొదటి భర్త ఆస్తిలో వాటా కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. తప్పకుండా ఆస్తి వివాదంలో న్యాయం దక్కే అవకా శాలున్నాయి.

6 Comments

  1. సార్ c b rao గారూ… మా సర్కిల్ల్స్లో ఈ విష్యం పై చాలా సార్లు డిస్కుషున్ జరగింది…జుట్టు పీక్కోవడమే గాని సరయిన సమాధానం ఎప్పుడూ దొరకలేదు..లక్కీ గా ఈ న్యూస్ చూసిన తర్వాత మిగతవారితో పంచుకోవాలని అనిపించింది…thanks ఫోర్ యువర్ comment..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s