విదేశాల్లో అప్రమత్తత అవసరం…


ముద్దు పెడితే ….జైలు శిక్ష
alg_charlotte-adamsదుబాయ్‌ కోర్టు అమెరికాకు చెందిన ఒక జంటకు జైలు శిక్ష విధించింది. బహిరంగంగా ముద్దుపెట్టుకోవడాన్ని దుబాయి కోర్టు తప్పుపట్టింది. చార్లొట్టే ఆడమ్స్‌ (25), యేమన్‌ నజాఫి (24) జంటకి ఒక నెల పాటు జైలు శిక్షను అనుభవిం చాలని తీర్పును ఇచ్చింది. వీరిద్దరూ తప్పు చేయలేదని విన్న వించుకున్న ప్రదిపాదనను కోర్టు తిరస్కరించింది. నవంబర్‌లో వీరిద్దరు బహిరంగంగా లిప్‌ కిస్‌ పెట్టుకోవడంతో దుబాయికి చెందిన స్ర్తీ కేసు పెట్టింది. దీంతో ఆడమ్స్‌,నజాఫిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ దంపతులు కాకపోవడం ఈ కేసు మరింత బలపడింది. మేం ముద్దు ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అని వారివురు చెప్పిన వ్యాఖ్యలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆడమ్స్‌, నజాఫికి చెందిన న్యాయమూర్తి ఖలాఫ్‌ ఆల్‌ – హోసనీ మాట్లాడుతూ తమ ముద్దాయిలు కేవలం బుగ్గపైన మాత్రమే ముద్దుపె ట్టుకున్నారు. వారు న్యాయానికి విరుద్ధమైన ఎటువంటి పని చేయలేదని న్యాయస్థానానికి వెల్లడించారు. ఎంత వాధించినా వారిద్దరికి జైలు శిక్షను తప్పించలేకపోయారు ఖలాఫ్‌.

రోమన్‌లా వ్యవహరించాలి… : దుబాయ్‌లోని ఆల్‌- అయిన్‌ యూనిర్శిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ ఆల్‌- ముతావా మాట్లా డుతూ దుబాయ్‌ సమాజం స్వేచ్చాయుత మైంది. ఇక్కడి జనాభాకు అనేక ఆచారాలు ఉన్నాయి. ఈ నియమాలను సందర్శకు లు సైతం పాటించాల్సిందే అని చెప్పారు.‘మీరు రోమ్‌లో ఉన్నప్పుడు, రోమన్‌లా ప్రవర్తించాలి.

ఎవరైనా అరబ్‌ దేశాలకు వచ్చినప్పడు ఇక్కడి న్యాయాన్ని గౌరవించాలి’ అని ఆల్‌ వెల్లడించారు. దుబాయ్‌కి చెందిన విశ్లేషకుడు క్రిస్టోఫెర్‌ డేవిడ్‌ సన్‌ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన వారంతా అన్ని ఆచారాలను పాటించాలని నియమం లేదు. అయితే ఈ సమాజానికి విరు ద్ధంగా ప్రవర్తించ కూడదు’ అని చెప్పారు. నజాఫి దుబాయ్‌లో పనిచేస్తున్నారు. ఆడమ్స్‌ అరబ్‌ దేశాల్ని సంద ర్శించడానికి వచ్చిన వ్యక్తి. వీరిద్దరూ 270 డాలర్లు విలువచేసే మద్యాన్ని సేవించారు. హద్దులను మరిచిపో యి ప్రవర్తించారు. ఈ విషయం కోర్టులో రుజువైయ్యే సరికి , వీరిద్దరికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

కీర్తి దెబ్బతింటుంది : ఈ కేసు దుబాయి పర్యాటక పరిశ్రమకి పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు క్రిస్టోఫెర్‌ డేవిడ్‌సన్‌ చెప్పారు. ఈ అరబ్‌ దేశాలు విశ్రాంతి స్థలాలుగా పేరుగాంచాయి. ఇక్కడి కట్టుబాట్లు సందర్శకులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ‘ఇటువంటి సంఘటనలు దుబాయ్‌ వాసులకు, సందర్శకులు మధ్య ఇబ్బందులను సృష్టిస్తాయి’ అని భావిస్తున్నారు. ‘దుబాయ్‌ వృద్ధి చెందుతున్నప్పుడు, ఆర్థికంగా బలపడుతున్న దశలో దుబాయి వాసుల వద్ద ధనం పుష్క లంగా ఉన్నింది. బాగా ఖర్చుచేసే వారు.

కాని ప్రస్తుతం దుబాయ్‌ ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. ముందు ముందు మరిన్ని ఇబ్బం దుల్ని ఎదుర్కొనున్నారు.వివిధ వర్గాలు కష్టా లను రుచి చూడనున్నారు’ అని ఆయన డేవిడ్‌ సన్‌ తెలిపారు.ముద్దు పెట్టుకున్నందుకు నెల రోజులు శిక్ష విధించడాన్ని అనేక దేశాల వారు హర్షించరు. దుబాయిపై ఆసక్తిని తగ్గించుకుం టారని పేర్కొన్నారు. ప్రస్తుతం టూరిస్ట్‌ రంగం ద్వారా ఆర్థికంగా పుంజుకోవడం దుబాయికి అవసరం. దుబాయి వాసుల మనోభావాలు దెబ్బతినకుండా, పర్యాట కులకు ఇబ్బంది తలెత్తకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇటువంటి సున్నితమైన విషయాలపై దృష్టి పెట్టి, జాగ్రత్తగా అడుగు వేయాలి

[పై వార్త చదివాక  నేను విన్న విష్యం ఒకటి గుర్తుకు వచ్చింది..వివరాలు…అరబ్ దేశం లో ఉద్యోగరీత్యా వుంటున్న ఒక డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు గ్రాండ్ గా చేశారట..అందరితో సరదాగా వుండే మనిషి కావడం తో లోకల్ గా కొంతమంది పరిఘయమవడంతో వాళ్ళని కూడా పిలవడం జరిగింది…వీడియోలు గట్రా తీశారు షరా మామూలుగా  ఫంక్షన్ని…మరసటి రోజు   పోలీసులు వచ్చి ఈయన్ని తీసుకు పోయి  court లో నిలబెట్టారు,…కారణం పుట్టినరోజు ఫంక్షన్లో  ఆ అబ్బాయి అలంకరణలో ఈ డాక్టర్ గారు అబ్బాయి  మొలతాడుకి ఒక డాలర్ బిళ్ళ లాంటిది అందంగా వుందని  కట్టారు…తీరా చూస్తే అదివాళ్ళ పవిత్ర చిహ్నం అట…తర్వాత పరిస్థితులు చాలా దారుణం గా నడిచాయట…ఉరిశిక్ష వేశారు అనికూడా అన్నారు..ఈ  వత్తిడికి  ఆయనకి హార్ట్ ఎటాక్ రావడం…కూడా జరిగింది…ఆఖరి క్షణ్ణాలో రాజుగారు[higher authority of that country] క్షమాబిక్ష ప్రసాదించడం తో ఆయన బయటపడ్డారని తెలిసింది. మొత్తం మీద ప్రాణాలతో ఇండియా తిరిగి వచ్చేశారు…ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే  చిరునామా దొరకలా…ఆయన నాకు అంతగా గుర్తు వుండడానికి కారణం ఆయన మా కాలేజీ జనరల్ సెక్రెటరీ గా మేము గెలిపించిన వ్యక్తి కావడం ఒక కారణం..కాబట్టి కొత్త ప్రదేశాల్లో వుండేటపుడు కాస్త ఏమరుపాటుగా వుండడం మంచిది…మరొకటి ఆయనకి తెలియకుండా మాటర్ ని బ్లాగ్ లో వుంచినందుకు  క్షంతవ్యుణ్ణి..]

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s