లంచావతారం..





 జీతాలు తీస్కుంటున్నాంగా?లంచం తీసుకోవడమే ఒక పెద్ద తప్పు…పైగా బుకాయింపులొకటా?సూర్య పేపర్ డైలీ april05/ srikakulam.,
                   ఎసిబి వలలో సీనియర్‌ అసిస్టెంట్‌
టెక్కలి,మేజర్‌న్యూస్‌: నందిగాం తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఎసిబి అధికారుల వలలో పడ్డాడు. నోఎర్నింగ్‌ సర్టిఫికెట్‌ కోసం రెండు వేల రూపాయలు ఓ వ్యక్తి నుంచి తీసుకుంటుండగా శనివారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. నందిగాం తహశీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.అప్పలస్వామి నో ఎర్నింగ్‌ సర్టిఫికేట్‌కు రెండు వేల రూపాయలు మండలంలోని కామధేనువు గ్రామానికి చెందిన కణితి ముఖలింగంనకు అడిగాడు. దీంతో ఆయన రెండు రోజుల క్రితం విజయనగరం జోన్‌ ఎసిబి అధికారులకు ఆశ్రయించాడు. వారిచ్చిన సలహా మేరకు శనివారం ముఖలింగం సీనియర్‌ అసిస్టెంట్‌ అప్పలస్వామి టేబుల్‌ మీద రెండు వేల రూపాయలను ఉంచాడు. అంతలోనే ఎసిబి డిఎస్పీ డి రవిబాబు, శ్రీకాకుళం ఎసిబి, సిఐ రాజ్‌కుమార్‌లు ప్రత్యక్షమే ఆ నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్పలస్వామిని విచారించారు. అతనిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవిబాబు విలేకరులతో మాట్లాడుతూ ఎవరి వద్దనైనా ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నా, ఎటువంటి లంచాలు అడిగిన వెంటనే తమకు తెలియజేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

గిరిజనుడుననే ఆసూయతో నిందలు : గిరిజనుడనని చిన్నచూపుతో అగ్రవర్ణాలు నాపై లేనిపోని నిందలు పెడుతున్నారని సీనియర్‌ అసిస్టెంట్‌ అప్పలస్వామి విలేకరుల ముందు వాపోయాడు. తాను ఎవరి వద్ద నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోలేదన్నాడు. రెండు రోజుల క్రితం నోఎర్నింగ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని తనకు రెండు వేల రూపాయలు తన టేబుల్‌పై ముఖలింగం ఉంచాడు తప్ప తాను తీసుకోలేదన్నారు

ప్రకటనలు

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s