తప్పుడు కేసులు…


ఏ చట్టాన్నికానీయండీ..పధకాన్ని కానీయండి ..మన ప్రజలు దుర్వినియోగపరచినట్టు..బహుశా మరెవరూ ప్రపంచంలో చేయరేమో?

ఎట్రాసిటీ చట్టం విపరీతంగా  దుర్వినియోగం అవుతుంది …వుదాహరణకి …ఒక  sample ముక్క…

‘చట్టాన్ని దుర్వినియోగం చేస్తే సహించం’

విజయనగరం (కలెక్టరేట్), ఏప్రిల్ 1: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని విజయనగరం డిఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. గురువారం సాయంత్రం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేఖరుల సమావేశలో ఆమె మాట్లాడుతూ గత నెలలో సోషల్ వెల్ఫేర్ డి.డి. జ్యోతిబాయి గంట్యాడ ఎస్సీ హాస్టల్ వార్డెన్ వి.సుధాకరరావును కుల దూషణ చేసారన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని ఇందులో ఫిర్యాదు దారుడు సుధాకర్ చేసిన అభియోగాలు నిరాధారమని తేలాయని అన్నారు. కేసువివరాలను ఆమె వివరిస్తు గత నెల 4వ తేదీన రాత్రి గంట్యాడ మండలం హాస్టల్ తనిఖీ నిమిత్తం వెళ్లారని ఆసమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో అక్కడ ఉన్న విద్యావాలంటీరు షేక్ మీరాబీ, వాచ్‌మెన్ వెంకటకృష్ణలను ఆమె వివరాలు అడిగిన అనంతరం హాస్టల్ పరిస్థితి పరిశీలించి వెళ్లిపోగా మరుసటి రోజు వార్డెన్ తనను డి.డి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేసారని ఆమె తెలిపారు. దీనిపై విచారణ జరపగా ఇది తప్పుడు ఫిర్యాదుగా తెలిసిందని అన్నారు. అదే సమయంలో జిల్లా కార్యాలయంలో వార్డెన్ తనను దూషించినట్టు ఆమె ఫిర్యాదు చేసిన్పపటికీ సాక్ష్యులులేనందున ఆకేసును పరిగణలోకి తీసుకోలెదని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందున సదరు వార్డెన్ సుధాకర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే ఇటీవల కాలంలో కుల దూషణ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని ఇది మంచి పరిణామం కాదని ఆమె అన్నారు. అదే విధంగా ఇటీవల జామి గ్రామంలో కూడా ఇటువంటి కేసు నమోదు అయిందని ఆ కేసులో ఫిర్యాదు చేసి అప్పల రాము అనే వ్యక్తిపై కూడా చర్యలుతీసుకుంటామని అన్నారు. కులదూషణ చట్టం దుర్వినియోగం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s