ఈ వార్తలో అబద్దం లేదు స్వయంగా చూశాం,…


మంత్రి గారి జిల్లాలోని అన్నీ లోకల్ ఎడిషన్ లలో వచ్చిన వార్త ఇది…..ఆంద్రభూమి డైలీ నుండి….చదవండి….
మంత్రిగారి ఖాతాలో మరో చెరువు
April 3rd, 2010 విజయనగరం, ఏప్రిల్ 2: మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం మరోసారి భూ ఆక్రమణల ఆరోపణల్లో చిక్కుకుంది. విజయనగరం శివార్లలో బొత్స కుటుంబీకులకు చెంది, నిర్మాణం జరుపుకుంటున్న ఇంజినీరింగ్ కళాశాలకు ఆనుకుని ఉన్న సుమారు మూడున్నర ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళాశాలకు ముందున్న చెరువును మట్టితో కప్పి చదును చేస్తున్నారు. భారీ యంత్రాలతో చెరువు పూడ్చివేత పనులు చురుగ్గా సాగుతున్నాయి. విజయనగరం రూరల్ మండలం గాజులరేగ పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 35/4లో భాగమైన 3.36 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రబంద (వాడుకలో ముద్దాడవారి చెరువు) మంత్రి కుటుంబీకుల కబ్జాకు గురైంది. చెరువును ఆనుకుని జిరాయితీ భూమిలో మంత్రి కుటుంబీకులు సత్య ఇంజినీరింగ్ కళాశాలను నిర్మిస్తున్నారు. దీనికి ముందు భాగంలో చెరువును పూర్తిగా కప్పి రహదారిని సైతం నిర్మించేశారు. చెరువును కొద్దికొద్దిగా కప్పుకుంటూ వస్తున్నారు. చెరువును ఆనుకుని గాజులరేగ పంచాయతీ ప్రజలు ఆరాధించే బండి మహంకాళమ్మ ఆలయం కూడా ఉంది. దీనికి ప్రహరీ నిమిత్తం కొంత మేర గోడను సైతం నిర్మించారు. చెరువు కింద కొద్దిపాటి సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ చెరువును పూడ్చేందుకు సన్నద్ధం కావడం స్థానికంగా వివాదస్పదం అవుతోంది. పట్టణాలు, వాటి పరిసరాల్లోని చెరువులను, కుంట\లను పూడ్చి, ఇతర అవసరాలకు వినియోగించాలంటే తప్పనిసరిగా కేబినెట్ ఆమోదం ఉండాలి. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ మంత్రి కుటుంబీకులకు చెందిన వ్యవహారం కావడంతో అధికారులు సైతం అటువైపు కనె్నత్తి చూడట్లేదు.

మంత్రి కుటుంబ కబ్జాలను అడ్డుకోండి
మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు పాల్పడుతున్న భూకబ్జాలను అడ్డుకోవాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ఎన్.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎర్రబంద చెరువు కబ్జాకు సంబంధించి వివరాలను శుక్రవారం ఆయన విలేఖరులకు వివరించారు. చెరువుల కబ్జాకు పాల్పడటం మంత్రి కుటుంబీకులకు కొత్తేమీ కాదన్నారు. లోగడ కె.ఎల్.పురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 81/2 లోని ఎర్ర చెరువును కబ్జా చేసి తనఖాతాలో జమచేసుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ భూమిని సైతం మంత్రి సోదరుని పేరిట కబ్జా చేశారని ఆరోపించారు. వుడా కాలనీలోని భూమిని సైతం వారి బంధువులు ఆక్రమించారని ఆరోపించారు. పట్టణ పరిధిలో మంత్రి, వారి కుటుంబ సభ్యులు పాల్పడుత్నున కబ్జాలను అడ్డుకోవాలని, చెరువును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులను, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ స్పందించని రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆయనతో పాటు సి.పి.ఎం నగర కమిటీ కార్యదర్శి రెడ్డి శంకరరావు, జిల్లా కమిటీ సభ్యుడు టి.వి.రమణ ఉన్నారు.
ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s