భగవత్ స్వరూపులు వైద్యులు.


అవునన్దీ  డాక్టర్లే……. కమీషున్ ఏజెంట్లు  గురించి  కాదు ఈ వార్త…సూర్య దినపత్రిక april 02..నుండి

వాక్సిన్లతో డబ్బుల పంట!
vaccinటీకాలు సాధారణంగా జబ్బులు నివారించేందుకు ఉపయోగిస్తారు డాక్టర్లు. ఈ టీకాలను అడ్డం పెట్టుకుని డాక్టర్లు విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటు న్నారు. వాక్సిన్ల తయారీ దార్లు డాక్టర్లకు పెద్ద ఎత్తున డిస్కౌంట్లతో ఈ మందులు సరఫరా చేస్తున్నారు. ఇవే మందులు డాక్టర్లు ఎంఆర్‌పీ ధరలకు రోగులకు అంటగట్టి లాభాలను జేబులో వేసుకుంటున్నారు. డిస్కౌంట్‌ ఎంత ఎక్కువ లభిస్తే డాక్టర్ల పంటపండిందన్నమాటే అంత లాభాన్ని మూటగట్టుకుంటారు. కొన్ని వాక్సిన్లు చిన్న పిల్లలకు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా డాక్టర్లు తమ లాభాలను దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లలకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆల్‌ ఇండియా ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎఐఐఎంఎస్‌)కు చెందిన రాకేష్‌ లోథా, డాక్టర్‌ అనురాగ్‌ భార్గవ చత్తీస్‌గఢ్‌కు చెందిన జన్‌ స్వస్తీయ సహియోగ్‌లు నిర్వహించిన అధ్యయనంలో తేలతెల్లం అయింది.

ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ తాజా సంచికలో ఈ విషయాలన్నీ ప్రచురించాయి. డాక్టర్లు తాము కొనుగోలు చేసే వ్యాక్సిన్లపై 30 నుంచి 69 శాతం వరకు లాభాలు గడిస్తున్నారని వారు పేర్కొన్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే టీకా డోస్‌లపై రూ.85 నుంచి మొదలుపెట్టి రూ.620 వరకు లాభాలు గడిస్తున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. సాధారణంగా పసిపిల్లలకు మూడు నుంచి నాలుగు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా లెక్క లేసుకున్నా ఒక్కో పసిపిల్లవాడి నుంచి ఈ డాక్టర్లు రూ.1800 వరకు లాభాలు గడిస్తున్నారని అధ్యయనంలో తేలిందని డాక్టర్లు వివరించారు.

ప్రకటనలు

2 Comments

  1. సమాజంలో అన్ని వృత్తుల్లాగే వైద్య వృత్తి కూడా వ్యాపారమై పోయింది.అయినా డిగ్రీలను లక్షలు పోసి కొన్నాక ఆ డబ్బు మళ్ళీ సంపాయించాలిగా మరి?

  2. శస్త్రచికిత్స ద్వారా బిడ్డను కనడానికి గర్భిణి నిరాకరించడంతో వచ్చే డబ్బులు పోయాయన్న దుగ్ధ కొద్దీ ప్రసవం తర్వాత బిడ్డ చేతిని కత్తిరించిందొక కర్కశ వైద్యురాలు.వైద్యవృత్తికే కళంకం లాంటి ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. శిశువు జన్మించాలంటే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారని… అందుకు నిరాకరించడంతో పుట్టిన తర్వాత శిశువు కుడి చేతిని కత్తిరించి టేపుతో అతికించారని తల్లితండ్రులు ఆరోపించారు. ఈ విషయం చెప్పకుండా ఇంటికి పంపించివేశారని చెప్పారు. రెండురోజుల తర్వాత ఈ విషయాన్ని గమనించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడి వైద్యుడు శిశువు చేతిని కత్తిరించారని చెప్పారట.(ఈనాడు22.7.2010)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s