ఏ డిమాండ్  కయినా  శాస్త్రీయమైన అద్యయనం ఎంత అవసరమో తెలియచెప్పే సూర్య పత్రిక  21 march కధనం చూడండీ….
లెక్కల్లో రిచ్‌… తెలంగాణ !
Telangana(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ-సీమాంధ్ర వివాదం నేపథ్యంలో అభివృద్ధికి సంబం ధించిన అధికారిక గణాంకాలు కొత్త విశ్లేషణలకు అవకాశం కల్పిస్తున్నాయి.వివిధ రంగాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత అభివృద్ధి సాధ్యమైందన్న దానిపై శ్రీకృష్ణ కమిటీకి అందిన గణాం కాలను నిశితంగా విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవు తున్నాయి. తొమ్మిది జిల్లాలున్న కోస్తా, 4 జిల్లాలున్న రాయల సీమ కలిపి 13 జిల్లా లతో పోలిస్తే 10 జిల్లాలున్న తెలంగాణలో అభివృద్ధి గత పదేళ్లలో శరవేగంగా జరిగినట్లు చూపుతున్న గణాంకాలు శ్రీకృష్ణ కమిటీ ముందున్నాయి.

విద్యుత్‌ వెలుగులు..
మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే విద్యుత్‌ వినియోగం విషయంలో తెలంగాణ ముందు వరసలో ఉంది. హైదరాబాద్‌, మెదక్‌, రంగా రెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఈ అంశంలో కోస్తా, రాయల సీమ కంటే ముందున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక, గృహావస రాల తలసరి విద్యుత్‌ వినియోగం అంశంలో.. హైదరాబాద్‌లో 1,057 కిలోవాట్లు, రంగారెడ్డిలో 1,285, మెదక్‌లో 1,292, నల్గొండలో 1,126, నిజామాబాద్‌లో 754 కిలోవాట్ల తలసరి విద్యుత్‌ వినియోగం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కోస్తా, రాయలసీమలోని ఏ ఒక్క జిల్లాల్లో కూడా ఇది 700 కిలోవాట్లకు దాటకపోవడం ప్రస్తావనార్హం. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణలో 8587 కిలోవాట్లు ఉండగా, కోస్తాలో 4460 కిలోవాట్లు మాత్రమే ఉంది.

రాయల సీమలో 2367 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగంలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక వ్యవసాయరంగం లోనూ తెలంగాణ రాణిస్తోంది. పదేళ్ల కిందట వరిసాగులో వెనుకబ డిన తెలంగాణ ఇప్పుడు అందులో సత్తా చూపి స్తోంది. ఈ విషయంలో.. వరి ప్రధానంగా ఉన్న కోస్తాతో పోటీ పడుతుండటం విశేషం. సహజంగా అన్ని వనరులూ ఉండే కోస్తాలో వరి దిగుబడి 80,65,910 టన్నులు ఉంటే.. నీరు, విద్యుత్‌, ఇతర వనరులు ఏమాత్రం అందు బాటులో లేవనే ప్రచారం ఉన్న తెలంగాణలో 53,60,547 టన్నుల దిగుబడి ఉండటం విశేషం.

రెండు ప్రాంతాల మధ్య కేవలం 30 లక్షల టన్నులు మాత్రమే తేడా ఉండటం ప్రస్తావనార్హం. మొక్కజొన్న దిగుబడిలో అయితే తెలంగాణ కోస్తాను వెనక్కి నెట్టేసింది. తెలంగాణలో 21,93,334 టన్నుల దిగుబడి ఉంటే, కోస్తాలో మాత్రం అది 17,56,167 టన్నులే ఉంది. మిరప దిగుబడి కోస్తాలో 4,37,619 టన్నులుంటే, తెలంగాణలో 2,87,435 టన్నులుంది. వేరు శెనగ దిగుబడి తెలం గాణలో 3,15,676 టన్నులుండగా, అది కోస్తాలో కేవలం 1,86,443 టన్నులు మాత్రమే ఉండటం గమనార్హం. నాయకులు, పార్టీలు ప్రచారం చేస్తున్నట్లు మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలు, ఇతర వనరులు ఏమాత్రం అందుబాటులో లేకపోతే తెలంగాణలో ఇంత దిగుబడి ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్న.

చదువుల్లోనూ భేష్‌..
ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల విషయంలో తెలంగాణ ప్రాంతం కోస్తాకు ఏ మాత్రం తీసిపోకుండా రాణిస్తోంది. ప్రాథమిక పాఠశాలలు మొత్తం 65,609 ఉండగా, అందులో కోస్తాలో 39,842 స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణలో 25,767 స్కూళ్లు, రాయలసీమలో 13,156, ఉత్తరాంధ్రలో 8,516 స్కూళ్లు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల సంఖ్య విషయంలో రంగా రెడ్డి, కరీంనగర్‌, హైదరాబాద్‌ మొదటి వరస స్థానాల్లో నిలిచాయి. జూనియర్‌ కాలేజీల్లో కూడా తెలంగాణదే హవా. హైదరాబాద్‌, రంగారెడ్డి టాప్‌లో ఉన్నాయి. జూని యర్‌ కాలేజీలు మొత్తం 4264 ఉండగా, కోస్తా-సీమ కలిపి 2314,తెలంగాణలో 1950 ఉన్నాయి. హైస్కూళ్లు మొత్తం 17376 ఉండగా.. కోస్తా-సీమ కలిపి 8247 ఉండగా, తెలంగాణలో 9129 ఉండటం గమ నార్హం. మాధ్యమిక విద్యలో మాత్రం కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌ రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన సర్కారు హాస్టళ్లలో కూడా తెలంగాణ వాటా కోస్తాతో పోటీపడుతోంది. మొత్తం 2358 హాస్టళ్లలో కోస్తాకు 1519, తెలంగాణకు 839 వాటా దక్కింది.

‘ఆరోగ్యం’ బాగుంది
ఆసుపత్రుల సేవలు, వైద్యుల సంఖ్య, పడకలు, డిస్పె న్సరీల విషయంలో తెలంగాణ కోస్తా ప్రాంతంతో పోటీ పడుతోంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొత్తం 1581 ఉంటే.. తెలంగాణలో 607, కోస్తా, రాయలసీమ కలిపి 974 ఉన్నాయి. వైద్యుల విషయంలో.. మొత్తం 9321 మంది ఉండగా, కోస్తా-సీమ కలిపి 5568 మంది, తెలం గాణలో 3753 మంది ఉన్నారు. కాంట్రాక్టు వైద్యుల విషయంలో మొత్తం 796 మంది ఉండగా కోస్తా-సీమలో కలిపి 461 మంది ఉండగా, తెలంగాణలో 335 మంది వైద్యులున్నారు. పడకల విషయానికొస్తే మొత్తం 39059 పడకలు ఉండగా.. కోస్తా-సీమ కలిపి 22052, తెలం గాణలో 17007 పడకలున్నాయి. ఈ విషయంలో హైదరా బాద్‌ ముందు వరసలో ఉంది.

‘సాగు’లోనూ సవాల్‌
ఇక చెరువులు, బావులు, కాలువలు, గొట్టపుబావుల కింద సాగయిన నికర విస్తీర్ణం విషయంలో ఎలాంటి వన రులు లేవన్న ప్రచారం జరుగుతోన్న తెలంగాణ ప్రాంతం కోస్తా-సీమతో పోటీ పడుతోంది. మొత్తం 48,20,251 హెక్టార్ల నికర విస్తీర్ణంలో తెలంగాణ వాటా 18,82,391 కాగా, కోస్తా-సీమ కలిపి 29,37,860 హెక్టార్లుగా ఉంది. బావులు, చెరువులు, కాలువల కింద పశ్చిమ గోదావరిలో 6,49,663 హెక్టార్లు సాగు కాగా, తర్వాతి స్థానంలో కరీంనగర్‌ నిలిచింది.ఈ జిల్లాలో 5,73,255, నిజామా బాద్‌లో 3,30,121, నల్లగొండలో 4,35,530, వరం గల్‌లో 4,44,945 హెక్టార్ల స్థూల విస్తీర్ణం సాగవుతోంది. ఎలాంటి కనీస వసతులు లేవనే ప్రచారం ఉన్న ఆదిలాబాద్‌లోనే 1,18,943 హెక్టార్ల సాగు ఉంది.

తలసరివాటాలోనూ టాప్‌ 
తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రస్థానం లో ఉంది. హైదరాబాద్‌ తలసరి ఆదాయం 4రెట్లు పెరిగింది. కరవు జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లా 3.16రెట్లు, రంగారెడ్డి జిల్లా 3.1రెట్లు అభివృద్ధి సాధించింది. వీటితో పోలిస్తే అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని భావించే విశాఖ జిల్లా తలసరి ఆదాయం మాత్రం 3.11 రెట్లు పెరగ డం గమనార్హం. అంటే ఇది మహబూబ్‌నగర్‌ కంటే తక్కు వ కావడం విశేషం. ప్రాంతాల వారీగా తలసరి ఆదాయా ల్లోనూ తెలంగాణదే సింహభాగం. తెలంగాణ తలసరి ఆదాయం రూ.24,543 కాగా, కోస్తాలో 24,241, రాయలసీమలో రూ.18,689 ఉండటం ప్రస్తావనార్హం.

అభివృద్ధికి అసలు కారణం ఇదీ..
తెలంగాణ అభివృద్ధి కాలేదని, నిధులు కేటాయిం పులో అన్యాయం జరిగిందంటూ కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఆరోపిస్తున్నప్పటికీ తాజా గణాం కాలు పరిశీలిస్తే మాత్రం నేతల ఆరోపణలతో ‘జరిగిన అభివృద్ధి’ తెరమరుగయిందని స్పష్టమవుతోంది. కారణాలు విశ్లేషిస్తే.. తొమ్మిదేళ్లు పరిపాలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఐదేళ్లు పాలించిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలే దానికి కారణమని తేలుతోంది. వారిద్దరి ప్రభుత్వాల్లో మంత్రు లుగా కొనసాగిన వారి ఒత్తిళ్లు, తెలంగాణకు అన్యాయం జరిగితే తమ ప్రజలు సహించరన్న హెచ్చరికలతో పాటు, ముఖ్యమంత్రులను మెప్పించినందునే ఇంత అభివృద్ధి జరిగిందన్నది నిర్వివాదం. నాడు టీడీపీలో కేసీఆర్‌, దేవేందర్‌గౌడ్‌, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వేణుగోపాలాచారి, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖరరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దిరెడ్డి, దామోదర్‌రెడ్డి, దివంగత మాధవరెడ్డి వంటి ప్రముఖులు నాటి సీఎం చంద్రబాబునాయుడుపై నిధుల కేటాయిం పులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి చేసి, వాటిని సాధించు కున్నారు.

నిజానికి, టీడీపీ హయాంలోనే ఈ వేర్పాటు భావన మొదలవడంతో పక్షపాతం నిందను తొలగించు కునేందుకు బాబు తెలంగాణపై ఎక్కువ దృష్టి సారించ వలసి వచ్చింది. వైఎస్‌ హయాంలో పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, వనమా వెంకటేశ్వర రావు, సబితా ఇంద్రరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్‌, శ్రీధర్‌బాబు వంటి ప్రముఖులు దివంగత వైఎస్‌పై ఒత్తిడి తెచ్చి, నిధుల కేటాయింపులో సత్తా చాటారు. వాటి వల్ల సదరు నాయకులకు వచ్చే ప్రయోజనాలేమిటన్నది పక్కకుపెడితే వీరందరి ఒత్తిళ్ల వల్లే తెలంగాణకు నిధులు వచ్చి, ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నది విశ్లేషకుల వాదన.

‘తెలంగాణ’ తో గందరగోళం
అధ్యక్షా…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలం గాణ నష్టం కన్న ఎక్కువగా లాభమే పొందిందని నేను విశ్వసిస్తున్నాను. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విష యంలో జరిగిన ఉల్లంఘనల నేపథ్యంలో విశాలాంధ్ర స్ఫూర్తిని నేను పరిశీలించదలచటంలేదు. మిగులు అంశాలు, ఉద్యోగాల విషయంలో తీవ్రమైన తప్పిదాలే జరిగి ఉండవచ్చు.

jaipal-reddyఅయినప్పటికీ ముల్కీ నిబంధనలు, గతంలోకన్న తక్కువగా తెలంగాణ ప్రాంతీయేతరులు తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించటం వంటి లాభాలు సమకూరాయి. ప్రత్యేక తెలంగాణ ఉంటే పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా మిగులు అంతా తరగి పోయి సాధారణ పరిపాలనపై దాని ప్రభావం తీవ్రంగా పడి ఉండేది. గత 12 సంవత్సరాలుగా ఏమి నష్టపో యామో దాన్ని తిరిగి సంపాదించుకున్నామని దీనితో ధ్రువపడుతున్నది.ప్రత్యేక రాష్ట్రంలో కోల్పోయిన దాని కన్న ఎక్కువగానే లాభపడ్డాం. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా విశాలాంధ్ర స్ఫూర్తి మంచిది అనేది నిరూపణ అయిందనేదే నా ఉద్దేశం. సభలో చాలా మంది సభ్యులు ఫజల్‌ అలీ కమిషన్‌ను ప్రస్తావిస్తూ, ఆ కమిషన్‌ ప్రత్యేక తెలంగాణ కోసం సిఫారసు చేసిందని చెబుతున్నారు.ఫజల్‌ అలీ కమిషన్‌ విశాలాంధ్ర స్ఫూర్తిని, ఆదర్శాన్ని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనం విషయంలో విశాలాంధ్ర మంచిదని కమిషన్‌ చెప్పింది.

అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సంధికాలా నికి మాత్రమే పరిమితం తప్ప శాశ్వత ప్రాతిపదిక కాదని కూడా అన్నది. ఫజల్‌ అలీ చెప్పింది మనం సాధించాం కనుక, గత 12 లేదా అంతకు మించి సంవత్సరాల కాలంలో మనం సాధించిన, అనుభవిస్తున్న స్ఫూర్తి లేదా ఆదర్శం నుంచి వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ అనేది నా దృష్టిలో కేవలం తెలంగాణ వరకే కాకుండా యావత్‌ దేశానికి అన్వ యించి చూడాలి. ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణను అంగీకరిస్తే దానిపై ఏర్పడే న్యాయ, రాజకీయ పర్యవసా నాలేమిటి? ప్రత్యేక తెలంగాణకు అంగీకరిస్తే, దేశంలో తొలిసారిగా పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రాన్ని గందర గోళంలో పడవేసినట్టవుతుంది. ఇదే పునరావృతమ వుతుందని మధులిమయే చెప్పిన మాట..

– 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంపై నాడు శాసనసభ్యుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి చేసిన ప్రసంగంలోని ముఖ్యభాగం… ఆయన మాటల్లో
ప్రకటనలు

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s