ఆరోగ్యం కోసం కొన్ని…


సూర్య దిన పత్రికలో  మన ఆరోగ్యానికి వుపయోగపడే కొన్ని…
ఆధనిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలామందికి కొన్ని విషయాల్లో అపనమ్మకాలు పోలేదు. డయాబెటీస్‌ ఉన్నవారు అన్నం తినకూడదు…వాతం చేస్తే వట్టికారం తినాలి…బొప్పాయి తింటే వెంటనే అబార్షన్‌ అవుతుంది…ఇలా మనం తినే ప్రతి ఆహారం మీద అనుమానాలే. ఈ అనుమానాలే మనిషిని మరింత బలహీనం చేస్తుంటాయి .ఇవి నిజమో కాదో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ వాటిని మాత్రం పాటించి తీరతారు. ఇలాంటి అపోహలు ఎక్కువగా ఆహారానికి, ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయి. అందువల్ల డాక్టరు సలహా కూడా అవసరం లేకుండా పాటించేస్తూ ఉంటారు. చాలా మంది ఈ విషయాలను గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయరు.కానీ ఇవి ఎంత వరకూ నిజం, ఎంత వరకూ అబద్ధం అనే సందేహం మాత్రం అందరిలోనూ ప్రశ్నగానే ఉండిపోతూ ఉంటుంది. ఇలా ఈ విషయాలు ప్రశ్నగానే మిగిలిపోవాలా? ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతే మన ముందు తరాలకు ఇవే అపనమ్మకాలను నూరి పోయాల్సి వస్తుంది. అందుకే ఈ వారం డాక్టర్‌..డాక్టర్‌ శీర్షికలో అపొహలు, వాస్తవాల గురించి ధీర అందిస్తోన్న ప్రత్యే క కథనం.

pregnentకొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.

కొన్ని రకాల అపోహలు
– బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది.
– కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
– మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
– గుడ్లు తింటే వేడిచేసి, విరేచనాలు అవుతాయి. గర్భవతులు గుడ్లు తినకూడదు.
-నారింజ, అనా స తింటే జలుబు చేస్తుంది.
-నెలసరి సమ యంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
-క్యారెట్‌, బీట్‌రూట్‌ కన్నా బలమైనది.
-కాకరకాయ రసం తాగితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
– అరటి పండు తింటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారు.
– జున్ను తింటే వాతం చేస్తుంది.
నిజానికి ఇవన్నీ మనం తరచుగా వినే విషయాలు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవేవీ మనకు హాని చేసేవి కావన్న విషయం అర్థమవుతుంది. అందుకే వీటిని గురించి వాస్తవాలు తెలసుకోవలసిన అవసరం ఉంది.
-బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రా వం ల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.
pregnant– కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో సోడియం లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రా వచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు -మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటా యి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం న్నా మాంసాహారం కొంతవరకూ మేలే.
– గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వ ల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడ కబెట్టిన గుడ్లకన్నా సగం ఉడక బెట్టినవితినాలి.
– నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అ వి శీతాకాలంలోనో, చల్లగా ఉన్న
ప్పుడో తింటే జలుబు చేసే అవ కాశం ఉంటుంది. ఒక్కోసారి ఇం దులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరో దక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.
-నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల ర ్తస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వు లు తినొద్దు అంటారు.
-బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకూ మంచిదే.
– కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.
-అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.
– జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటా యి. అందువల్ల ఎక్కువ తింటే వాతం చేయవచుచ. అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

– డా.అనసూర్యదేవి

8 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s