దమ్ముంటే సంతకం చెయ్యండి


ఇది ఎన్నోసారో చెప్పలేను గానీ ప్రతీ సారీ ఎవరయినా గానీ ఈ విష్యం చెప్తే వొళ్ళు మండి పోతుంది .విష్యం ఏమంటే  ..ష్యూరిటి  సంతకం  పెట్టాం . బాకీ తీర్చ వలసిన వాడో,లేకుంటే  చిట్ కట్టాల్సిన వాడో,  ఎగ్గొట్టటం వల్ల మేం ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తూంది అవ్వన్నీ మా నెత్తిన పడ్డాయి… అని భాధ  పడే వాళ్ళ గురించి  …ఏం చూసి ష్యూరిటి ఇస్తారు మీరు?ఎంతకు ష్యూరిటి ఇస్తున్నారు మీరు?అవ్తలి వ్యక్తి ఎట్లాంటి వాడు?అతని ఆర్దిక పరిస్థితి ప్రస్తుతం ఏమిటి?ఈ అప్పో,లేకుంటే పాడేసుకున్న చిట్  ఆఖరివరకు ఆయన తీరుస్తాడా? సంపాదనా పరుడే అవ్వచ్చు…అంతకు మించి అప్పుల్లో ములిగి వుంటే?అసలు మన పరిస్థితి ఏంటీ?అల్లాంటి బర్డెన్ మన నఎత్తిన ఏదయినా పడితే మనమ్ భరించే స్థితి లో వున్నామా ….ఎలాంటి ఆలోచనా లేకుండా షూరిటీ సంతకాలు చేసేసి …తర్వాత లబో ధిబో మనడం …వీళ్లను చూస్తే జాలి కలగడు కదా  …నరికి పొగులు పెట్టయ్యాలని అనిపిస్తూంది..
మరి కొంతమంది వుంటారు ….షూరిటీ  సంతకాలు మనం పెట్టమ్ అని తెలుసు ….గాబట్టి మన అన్ననో,కజిన్నో వెంట పెట్టుకుని వస్తారు …మన వాళ్ళను చూసి మొహమాటమో ,కొంత దైర్యమో షూరిటీ ఇస్తాం …కట్ చేస్తే షరా మామూలే …నోటిస్ మన చేతికి అందుతుంది…రిక్మెండేషున్ చేసిన బావనో,అన్ననో పట్టుకుని బావురు మన్నామనుకోండి …వాళ్ళు కూడా మనతో పాటు కొంత సేపు భాధ పడీ…చివరికి ఆ అప్పో సప్పో మననే తీర్చమని …ఓదార్చి  పంపిస్తారు..అయితే  గియితే చెప్పవచ్చేధి .ఏమంటే….ఖరాఖండిగా  వుండండి ..మొహమాటం అసలే వద్దు …మోసం అనేది రకరకాల రూపాల్లో వుంటుంది,అది  ఎప్పుడూ ఒకేలా రాదు…గాబట్టి ఏరూపంలో  వస్తుందో చెప్పలేమ్ …అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది….దురదృష్టం తలుపు తీసే వరకూ తడుతూనే వుంటుంది …[500 రూపాయల పార్టీకి లక్ష రూపాయలు వదిలించుకున్న మా బాలయ్య  inspiration తో]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s