అపరిచితుడు…ఆయని భార్యా


కరెంట్ వృధా  గురించి ఒక టపా వ్రాశానో  లేదో ఈ మద్య ఒక గమ్మత్ అయిన విష్యం ఒకటి జరిగింది ….ఈ టివి  నేరాలూ ఘొరాలూ  ఫేమ్   నూతన్ ప్రసాద్ వాయిస్ ఓవర్ తో చెప్తా వినండి ….యెప్పటిలాగే సుబ్బరావు ఆఫీసు నుంచి ఫుల్ గా పీకల  దాకా తాగి ఇంటికి వచ్చాడు…ఇంటికి వచ్చిన  సుబ్బారావు  పొయ్యి మీద మరుగుతున్న పాల గిన్నిని చూశాడు …వేంటనే బార్యని పిలిచి పొయ్యమీద  యెధయినా వొండేటప్పుడు   మూత పెట్టమన్నాను  కదా యెందుకు పెట్ట లేదూ  అని భార్యని అడిగేడు?ఇంతకీ అంత మత్తు లోనూ సుబ్బరావు  అలా అడగ డానికి కారణం.. మూత పెట్టడం వల్ల ఆవిరి లోపలే వుండి ,పదార్దాలు త్వరగా వుడుకు తాయనీ, అందువల్ల గ్యాస్ ఆధా అవుతుంది  అనీ… యెక్కడో  చదివి వుండడం …అయితే  అందరి బార్యల్లాగే సుబ్బారావు బార్య కూడా భర్త మాటని పెడచెవిని పేట్టేధి …ఏ రోజూ కూడా మొగుడి మాటల్ని సీరియస్ గా తీస్కోలేదు .ఇప్పుడు కూడా మొగుడు అడిగిన ప్రశ్నని  సీరియస్ గా తీసుకోకుండా మూతపెట్ట నంత మాత్రాన్న  కొంప  ఏమీ మునిగి పోదులే అంటూ సమాదానం  ఇచ్చింది.దాంతో చిర్రేత్తు కొచ్చిన  సుబ్బారావు  మూలనున్న కర్రను తీసుకుని బార్య నెత్తిమీద పెడీ.. పెడీ.. పెడీ… మని కొట్టాడు, దాన్తో ఆయన బార్య గిర గిరా   గిర గిరా తిరుగుతూ నేల కూలింది …. ఇది చూసిన పిల్లలు 108 కి ఫోన్ చేసి, పోలీసుల్నికూడా  పిలవడం తో  పోలీసులు రంగ ప్రవేశం చేసి కేస్ను దర్యాప్తు చేస్తున్నారు…ఇదండీ  సంగతీ …
తర్వాత పోలీసు లు వచ్చాక కూడా ఆ త్రాగుబోతు మొగుడు గాస్ వేస్టే చేస్తున్నందుకే బార్యను కొట్టి నట్టు చెప్పాడు …..ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే చాలా మంధి ఇలానే గ్యాస్ వేస్టే చేస్తూ వుంటారు ..ముక్యమ్ గా కుక్కర్ లు వాడని వాళ్ళు …వేడి నీళ్ళ కనో ,టీ కనో , మరోటో… స్టౌ మీద పడేసి మూత పెట్ట కుండా వధి లేస్తూ వుంటారు…గాస్ కాలుతూనే వుంటుంధీ పొయ్యమీద …5 నిమషాల్లో  అవ్వాల్సింధి 10 నిమిషాలు పడుతుంది ..గ్యాస్.మంచి నీళ్ళు,కరెంట్ లాంటివి మనకి వుత్పాదన  తక్కువ …మనకు డబ్బులు పే చేసినా గానీ కావల్సినంతగా  దొరికేవి కాదు…గాబట్టి వీటిని పొదుపుగా వాడు కోవడం వల్ల …కొరత లేకుండా చూసుకోవచ్చు….చిన్న విష్యం …గ్యాస్ వేస్ట్  చేసే వాళ్లందర్నీ తాగి వచ్చి తలలు పగలు కొట్టమని చెప్పడం నా  ఈ టపా వుద్యేశ్యం కాదు…నేను అపరిచితుడ్ని…కాదు…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s