అనారోగ్య శ్రీ


మొన్నఒక బ్లాగ్లో ఈ ఆరోగ్యశ్రీ గురించి చదివా..అప్పుడే ఈ పోస్ట్  వ్రాద్దామనుకున్న…ఎంత  మంచి పధకాన్నయినా మన ప్రజలు ఎలా నాశనం చేసేస్తారో దానికున్న మంచి targetని ఎలా చిధ్రం చేసేస్తారో ఈ ఆరోగ్యశ్రీ ఒక వుదాహరణ మాత్రమే…స్నేహితుడికి  ఆక్సిడెంట్ అయితే అర్ధరాత్రి హాస్పిటల్కి వేళ్లాల్సి వచ్చింది…అప్పుడేఅక్కడికి ఒక 30 ఏళ్లువున్న ఆడపేషెంట్ని తీసుకువచ్చారు. విషయం ఏమిటంటే నీరుడుఅవ్వడం  లేదు..అంటే bladderలోurineవుంది కానీ పేషెంట్ పాస్ చేయలేకపోతూంధి…ఇంతకీ ఏమి జరిగింది అంటే ఒక పది రోజుల క్రితం ఈ పేషెంట్టు  నడుం నొప్పిగా వుందని  పెద్దస్టార్  ఆసుపత్రికివెళ్ళింది???కూలీ పని చేసుకునే వాళ్ళయినా గానీ  ఆరోగ్యశ్రీ కార్డ్ వుండడం తో స్టార్  హొస్పిటల్ కి  వెళ్లాల్సి వచ్చింది.అక్కడి డాక్టర్లు ఎలాగో కార్డ్ వుంధీ గవర్నమెంట్ payచేస్తుంది కదా …అందుకనిlaminectomy ఆపరేషన్ చేసేశారు…వారం తర్వాత డిశ్చార్జ్  కూడా చేసేశారు…45కే.జి.లుకూడా వుండని ,సర్జరీకి అంతగా ఫిట్ 

 కానీ, ఆపరేషన్ చార్జీలు  ఏ మాత్రం భరించలేని ,అసలు ఏమాత్రం అవసరం లేని ఆపరేషన్ డాక్టర్ లు ఎందుకు చేసినట్టు …ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తాయి గాబట్టి అదీ కూడా చాలా పెద్ద అమౌంట్స్ గాబట్టి .ఇప్పుడు డిశ్చార్జ్ అయినాక పట్టించుకునేవాళ్లు లేక ఆపరేషన్ తాలూకు కాంప్లికేషుస్న్ తో వీళ్ళు ,ఇక ఒళ్ళు గుల్లయి మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే …ఇలా యెన్నో అనవసరమయిన ఆపరేషన్ లు కేవలం ప్రభుత్వం పెద్ద బిల్లులు పే చేస్తూన్నందు వల్ల…కోకొల్లల్లు గా  జరుగుతూవున్నాయి … ఎంతో ప్రజా ధనం వృధా అవుతుంది …నిజంగా తమ చేతి డబ్బులు అయితే వీళ్ళు కూడా ఆపరేషన్ కి అంగీకరించక పోను  …యధా రాజా తధా ప్రజా.
    ప్రకటనలు

    స్పందించండి

    Fill in your details below or click an icon to log in:

    వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

    You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

    Twitter picture

    You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

    ఫేస్‌బుక్ చిత్రం

    You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

    గూగుల్+ చిత్రం

    You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

    Connecting to %s