మెరిసేదంతా బంగారం కాదు


న్యూస్ పేపర్లు చదివే మనబోటివాళ్లంతా అందులోనే మాటర్ అంతా నిజమే అనుకుంటాం అసలు  చదవగానే అవునా స్మీ అనుకుంటాం  న్యూస్ పేపర్ మనకొక బైబిల్ ఖురాన్ భగ్వద్గీత తో సమానం …..10 రోజుల క్రితం అనుకుంటా హైదరాబాద్ మైన్ ఎడిషన్ లో మరుసటి రోజు మిగతా జిల్లాల మైన్ ఎడిషన్లో ఒక న్యూస్ ఐటెమ్ వచ్చింది …ప్ర  శవమ్….అంటే ప్రసవం అన్న మాట …డెలివరీ కోసం హాస్పిటల్ కు వస్తే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల  ఆ  తల్లి  తన  నాల్గవ బిడ్డను కూడా పురిటిలో యేలా పోగొట్టుకున్దో  రక్తి కట్టిస్తూ మనకు బిపి  పెరిగిపోయేటట్టు వ్రాసిపదేశాడు  ఆ విలేకరి ….విషయం యెమంటే ప్రసవం కోసం హాస్పిటల్ కు వచ్చిన ఆ పేషెంట్ ను యెవరూ  పట్టించుకో లే నందు వల్ల ఆకరి క్షనమ్ లో ఆశా వొర్కెర్ గొడవచేయడం వల్ల పేషెంట్ ని హాస్పిటల్ లో కి రానిచ్చి బిడ్డను చేతులతో లాగే యడం వల్ల మృత శిశువు జన్మించిందనీ ఇది నాల్గవ బిడ్డ అనీ అందరూ మృతశిశువులే అంటూ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం అనీ రాసుకొచ్చారు మన no 1    పేపర్ ఈ నాడు వారు…మా జిల్లా వార్తా మా వూరి న్యూస్ అవ్వడం వల్ల ఒక పూటంతా విష్యం సేకరిస్తే తెలిసిన విష్యాలు ఇవ్వీ ….ఆటొలో వచ్చిన ఆ పేషెంట్ అప్పటికే నొప్పులు యెక్కువ కావడం తో బిడ్డ తల ఇక డెలివరీ  అవ్వటమే తరువాయి అన్న స్థితి లో నర్స్ లు నార్మల్ డెలివేరి చేసేశారు దాన్ని ఈ పదో క్లాస్ కూడా పాస్ అవ్వని విలేకరి… చేతులతో బిడ్డని లాగేశారు అని వ్రాసాడన్న మాట .అంటే చాలా క్రూడ్ గా behave చేశారు హాస్పిటల్ వాళ్లు అని .రిపోర్ట్ చేశాడు ఆ విలేకరి .. .నార్మల్ డెలివరీ చేతులతో కాక మారేలా చేస్తారో యెమో ?కాళ్ళతో కూడా డెలివరీ చేస్తారా?
ఇక మృత శిశువు ….బిడ్డ చనిపోడానికి యెవ్వరో ఒకరు నిర్లక్ష్యం అయ్యి వుండాలిగా …మరి పేపర్ వాడి గోల కూడా అదే గా …హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యం ….ఇక్కడ బిడ్డ చని పోవడానికి ముక్యకారణం బిడ్డ పూర్తిగా నెలలు నిండి పుట్టకపోవడమే …అప్పటికి 7 నెలలు కూడా నిండకపోవడం ఒక కారణమైతే …నొప్పులు రావడం తోనే బ్లీడింగ్ అవ్వడం దానితో గర్భ సంచి లోని  బిడ్డ మరింత వత్తిడికి గురై డెలివరి …అయ్యే లోపు చనిపోయింది …బ్లీడింగ్ అవ్వ కున్నా ,తగినంత బరువున్నా బిడ్డ బ్రతికేదే …7 వ నేలలో కూడా …అన్నిటి కన్నా మరొక ఘోరమైన అబద్దమ్ నలుగురూ మృత శిశువులే అన్న వార్త…తరువాత తెలిసిన విష్యం యేమిటంటే ….మొదటి బిడ్డ మామూలుగానే పుట్టాడనీ కాకపోతే కొన్నాళ్ల తర్వాత చనిపోయాడనీ….రెండవ మూడవ పిల్లల గురించి అసలు తెలియనే లేదు?బహుశా ఎం.టి.పి.లో అబార్షన్ లో అయ్యి వుంటాయి..ఈ విధమ్ గా ప్రజల్లో యవరో ఒకళ్లను బలి చేస్తూ …నిజాల్ని మాసిపూసి మారేడు కాయ చేస్తూ వుదయమే మన ముంగిట్లో వాలే ఈ కట్టు కదల విష పుత్రికల్ని నమ్మేసి మనం బి.పి.లు పెంచు కోవడం మానేద్దామ్ …  చివరిగా ఈ కట్టుకధ పై ఎంక్వైరీ లూ అదికారులకి మొట్టి కాయలూ తప్పలేదు ..వాళ్ళ తప్పు లేకున్నా … ఇందు మూలం గా నాకు తెల్సిన విష్యం యెమంటే …అబద్దానికి  గొంతు పెద్దదీ ….

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s