డాక్టరు గార్ని చితక్కొట్టారు??


తాగి తాగి లివర్ ఫెయిలయిన ఎనబై సంవత్సరాల వృద్దుణ్ణి,అర్ధరాత్రి ఎమర్జెంటుగా తీసుకు వస్తే…ఆ పేషంటుని బతికించనందుకు…?
ఈ వీడియో చూడండి…

డాక్టర్లు ఎందుకు జనాల్లో పలచన అయ్యారు??


రాత్రి పదవుతుంది….
ఒక ఆరెమ్పీ డాక్టరు నుండి ఫోను…
సార్ డెలివరీ కేసు తీసుకొస్తామ్…
ఏమయ్యింది?
ఉదయం నుండీ ఉమ్మి నీరు పోతుంది….డెలివరీ అవలేదు…భయపడుతున్నారు సార్…
తీసుకుని వచ్చేయండి….తెలుసు కదా….రాత్రి ఎవరూ దొరకరు….మత్తు డాక్టరుకు ఎక్కువ ఇవాలి…పదిహేను వేలు అవుతుందని చెప్పండి…
కొన్ని చోట్ల ఈ ఎమవుంటు…ఇరవై ముప్పై వేల వరకూ….అవుతుంది…
ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న…?
బాంకుకో…తాహ్సీల్దార్ ఆఫీసుకో …సమయానికి వెల్లే జనం…. …అర్ధరాత్రయినాక.. ఆసుపత్రికి తీరిగ్గా బయలు దేరుతారు…ఎందువల్ల??
రోజంతా…అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా…డాక్టరు దొరకడన్న భయం ఎందుకు లేదు?
ఎమర్జెన్సీ….ఈ పేరుతో…తాశీల్దారు ఆఫీసుకి….బాంకుకు అర్ధరాత్రి వెలితే అక్కడ పలకరించే వాడు ఎవడూ ఉండడు…
అదే…ఆసుపత్రికి …అందులోనూ ప్రయివేటు ఆసుపత్రికి వెలితే??డాక్టరు కుక్కలా మెలుకవగా ఊంటాడు…ఎంత లేటుగా వస్తే…అంత ఎక్కువ లాగేయాలన్న ఆలోచనతొ…సాదరంగా ఆహ్వానిస్తాడు ప్రయివేట్ డాక్టర్…
రోజంతా ఇంటిలో జబ్బుతో ఎందుకు మురిగి పోయావని అడగడు!!
అర్ధరాత్రి వచ్చాడు…ఎంతయినా లాగేయొచ్చు అన్నదే…డాక్టరు ఆలోచన!!
ఇక్కడె బీజమ్ పడుతుంది డాక్టర్ల మీద చీప్ అభిప్రాయం…
ఇది ఒక చిన్న ఉదాహరణ…ఇప్పుడు చెప్పండి….మీకు బాంకు పనీ….ఆసుపత్రి పని ఉంటే ఎవరి పని ముందు ముగిస్తారు….??
బాంకు పనే కదా..డాక్టరు ఎప్పుడు వెళ్ళినా దొరుకుతాడు….కాబట్టి…
ఎందుకు డాక్టర్లు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది….ఇందువల్లే…
రావాల్సిన టైం లో రాకుండా…ఎప్పుడైనా దొరుకుతాడన్న అభిప్రాయంతొ…జనం …అడ్ద దిడ్డంగా రావ్దంతో….మామూలు కేసులూ…ఎమర్జెన్సీ గా తయారవుతున్నాయ్!!
70% గా ఉన్న రూరల్ జనానికి డాక్టర్ల మీదున్న అభిప్రాయం ఇది…
వీళ్ళు, ప్రజలు..పెద్ద టవున్లలో స్పెషలిస్టుల దగ్గర …..అసహనంగా వ్యవహరించడానికి…. ఈ రూరల్ ఏరియా లో …డాక్టర్ల బిజినెస్ మెంటాలిటీ బీజం వేస్తుంది…
ఇది…మొత్తం అనారోగ్య వ్యవస్థలో…1% మాత్రమే…
(ఇంకా ఉంది…)

ఎర్రగడ్డ కు పంపండి కాంగ్రెస్ నాయకుల్ని…


విభజన హామీలపై కేంద్రం ఆమోదం తీసుకోండి

సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేసిన రఘువీరా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తున్నామని ఢిల్లీ నేతలతో ప్రకటన చేయించాకే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి తిరిగి రావాలనీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిపైనా కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవాలని, ఈ విషయంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని, అందుకే కోటి సంతకాల సేకరణ చేపట్టామని చెప్పారు. విభజన చట్టం హామీల అమలు, పోలవరం సాధన కోసం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లాలోని అనకాపల్లి, చింతపల్లి ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించారు. తొలుత అనకాపల్లి నెహ్రూచౌక్‌లో పలువురి నుంచి సంతకాలు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలంతా నినాదాలు చేస్తూ.. రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలోనూ, తర్వాత తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో విలేకరులతోను రఘువీరా మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ముందుకు సాగాలనీ, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 23న పార్లమెంట్‌ ఉభయ సభల కాంగ్రెస్‌ ముఖ్యులతో కలిసి ప్రధాని మోదీకి వాటిని అందించి, ఒత్తిడి తెస్తామన్నారు.

అదీ సంగతండీ….

పిచ్చెక్కినట్టు,రాహూల్ ని ప్రధాని చేసేయాలన్న తాపత్రయం తొ…బీజేపీని బ్రతిమాలి…
ఆఖరు నిమిషంలో బెదిరించి….విభజన బిల్లుని పెట్టించి….
రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పనికిమాలిన బ** లు…
ఇప్పుడు బాబు…విభజన బిల్లులోని అంశాలన్నీ కేంద్రం తొ ఒప్పించాలట…
బాబు ఒప్పించి అమలు చేయిస్తాడనే…ఈ వెధవాయిలు విభజన బిల్లు తెచ్చారా?
మీరు డాష్ అయితే…మీ పార్టీ వాళ్ల తోనే డెల్లీ లో పట్టు పట్టించండి…
బిల్లు పెట్టాం….కొత్త రాష్ట్రానికి హామీలున్నాయ్…నెరవేర్ఛాల్సిన భాద్యత మా కాంగ్రెస్ దే అని?
మీరు చండాలం చేసి,ఇప్పుడు బాబు అవన్నీ సాధించాలంటారేమిటీ?
జనం కొట్టిన దెబ్బకు…కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారొ కూడా…వాళ్లకు అర్ధం అవుతున్నట్టు లేదు!!
పొండి…పోయి బీజేపీ నో మరొక పార్టీ నో వెతుక్కోండి…జాయినవ్వండి!!
మీ కాంగ్రెస్ నాయకుల ప్రకతనలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు!!

తెలుగు (న్యూసెన్స్)న్యూస్ చానెల్స్ పై ఎఫ్.బి. లో…


(సీ.ఎన్.ఎన్.మరోటో  వెదుక్కోవాలి గాని )మచ్చుకు స్క్రోలింగ్ లోనైనా ప్రంపంచాన్ని పట్టించుకోని తెలుగు చానెల్స్ పై…పెర్ఫెక్ట్ గా సరిపోయింది ఇది…