జైలరికం లో ఉన్న మజా..
హత్య జరిగితే…శవాన్ని పెట్టుకుని అనుమానితుల పై ఎంక్వైరీ చేసి…
సాక్ష్యాదారాలు చూపాక గానీ వీళ్ళు హంతకులని నిర్దారించలేం..
ఎందుకంటే రహస్యంగా జరిగే హత్యల్లో శవం తప్పా మరేం ఆధారలు దొరకవు గాబట్టీ…….
కానీ ఇక్కడ వీళ్ళ కళ్ళు చెదరే భవంతులు..ఆ విలాసాలూ….దర్పం…
అడుగడుగునా కోట్లాది రూపాయల్ని మింగేసారని అర్ధం అవుతూనే ఉంది……..
తప్పుడు పద్దతుల్లో వేల కోట్ల రూపాయల్ని తప్పు దారి పట్టించిన అధికారులకూ…మింగేసిన ..భకాసురులకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలేమిటీ…..
పబ్లిక్ లో ఉరితీయాల్సిన ఈ స్కాం గాళ్ళకు ఎట్టి పరిస్తితుల్లోనూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని ఎవరైనా అర్జెంటుగా కోర్టుకు పోతే బాగుణ్ణు…..లేకపోతే..
ఇక ప్రతీ వాడు అడ్డంగా జనాల డబ్బు దొబ్బేసి……జ గన్గా ..లిలా కొంతకాలం మహారాజు లా బ్రతికేసి…..దొరికిపోతే…స్పెషల్ ఖైదీగా జైల్లో ..హాయిగా జీవితం గడిపేయొచ్చు


జైలరికం లో వున్న మజా,
జామ్మని జాము పోద్దేలే
ఆపై హార్టు ప్రాబ్లెం అని
జుమ్మని స్ట్రెచ్చర్ పై హవాలే !!
చీర్స్
జిలేబి.
హహ బాగా చెప్పారండీ! నేనింకా టైటిలు చూసి ఇల్లరికంలో ఉన్న మజా అన్న పాటకు పేరడీ వ్రాసారనుకున్నా!
డబ్బుతో యేమయినా చెయ్యచ్చు, మన దేశంలో. సాధ్యమే!!!
@Zilebi హమ్మా ఎన్ని అవిడియాలు…ఎన్ని అవిడియాలు..
ఇక్కడి జనాల తీరు చూసి వెర్రి నవ్వులు పుడుతున్నాయి ఆలోచించేవాళ్ళకు 
@Sarath Kaalam:
@రసజ్ఞ..thanks పాటలు కూడానా…రోజూ పేపర్ చూస్తోంటే ….
@ Kastephaleమనిషి తలుచుకుంటే ఏదయినా సాధ్యమే…..కానీ మన వాళ్ళు తెలివితేటల్ని ఇలా ఉపయోగించుకుంటున్నారు….పక్కనున్న చైనా జపాన్ లను ఒక్క సారి పరిశీలించండి…(నెట్ లోనే) …మన నేతలు ఎంత వెధవాయిలో అర్ధం అవుతూంది….